Chandrababu Singapore Tour: ఏపీలో( Andhra Pradesh) పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఐదేళ్లలో వీలైనంత ఎక్కువగా పరిశ్రమలను తీసుకురావాలని భావిస్తోంది. పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈనెల 26న సింగపూర్ వెళ్ళనుంది. ఐదు రోజులపాటు అమెరికాలో ఈ బృందం పర్యటించనుంది. పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది. సింగపూర్ ప్రభుత్వంతో పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ పై ఈ బృందం చర్చించనుంది . దీంతో సీఎం నేతృత్వంలోనే బృందం సింగపూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా ఐదు రోజులపాటు ఈ బృందం సింగపూర్లో పర్యటించనుండడం విశేషం.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
* సీఎం వెంట మంత్రులు..
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో( CM Chandrababu) పాటు మంత్రులు కూడా ఉండనున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సి ఆర్ డి ఏ కమిషనర్ కన్నబాబు, ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈఓ సాయికాంత్ వర్మ ఈ బృందంతో పాటు వెళ్ళనున్నారు. ఈనెల 26 నుంచి ఐదు రోజులపాటు సింగపూర్ పర్యటన కొనసాగనుంది. ఈనెల 30న ఈ బృందం తిరిగి వచ్చే అవకాశం ఉంది. సింగపూర్ నుంచి పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ వంటి విషయాల్లో సహకారం తీసుకోవాలని చూస్తున్నారు. సింగపూర్ లో రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులతో ఈ బృందం చర్చిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
* అమరావతికి కేటాయింపులు..
ఒకవైపు సింగపూర్( Singapore) పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కాగా.. అమరావతికి సంబంధించి సైతం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో 13 సంస్థలకు 65.89 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కిమ్స్ కు వైద్యశాల కోసం 25 ఎకరాలు, బీసీ రాష్ట్ర కార్యాలయానికి రెండు ఎకరాలు, మిగిలిన సంస్థలకు 5.4 ఎకరాలు కలిపి.. మొత్తం 32.4 ఎకరాలను కొత్తగా కేటాయించారు. గతంలో కేటాయించిన 33.49 ఎకరాలను పునరుద్ధరించారు. 2014లో సైతం ఆరు సంస్థలకు కేటాయించిన భూములను తిరిగి చిన్న చిన్న మార్పులతో కేటాయింపులు చేశారు.