Homeఎంటర్టైన్మెంట్Actress Saroja Devi passes away : ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్టీఆర్ హీరోయిన్ కన్నుమూత

Actress Saroja Devi passes away : ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్టీఆర్ హీరోయిన్ కన్నుమూత

Actress Saroja Devi passes away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వెండితెరను ఏలిన అలనాటి నటీమణి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి మరణించినట్టు సమాచారం. ఈమె ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, ఏఎన్నార్‌తో కలిసి నటించి అప్పటి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తెలుగులో మాత్రమే కాదు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ వంటి ఇండస్ట్రీల్లో ఏకంగా 200 సినిమాలకుపైగా సరోజాదేవి నటించి మెప్పించారు. ఈ నటి 1938 జనవరి 7న జన్మించింది. సరోజా దేవి 1955లో ‘మహాకవి కాళిదాస’ సినిమాలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Also Read: డైరెక్టర్ కృష్ణవంశీ తో కోట శ్రీనివాస రావు కి ఇంత పెద్ద గొడవ జరిగిందా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆపలేకపోయాడా!

దక్షిణ భారత సినిమా రంగంలో నాలుగు దశాబ్దాలపాటు తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ నటి. 1940 జనవరి 7న బెంగళూరులో జన్మించారు ఈమె. ఈ నటి చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే 1955లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది.

ఆమె 1957లో’పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. అదే సంవత్సరం ‘భూకైలాస్‌’ వంటి విజయవంతమైన సినిమాల్లో కూడా మెరిచింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లతో కలిసి ‘పెళ్లిసందడి’ , ‘జగదేకవీరునికథ’ , ‘మంచి చెడు’ , ‘దాగుడు మూతలు’,’శకుంతల’, ‘సీతారామకల్యాణం’, ‘దానవీరశూరకర్ణ’ వంటి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో కూడా నటించింది. 1963లో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లతో కలిసి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలో నటించి తన రేంజ్ ను మరింత పెంచుకుంది.

Also Read: కోట శ్రీనివాస రావు అందరికి నచ్చే వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్

తెలుగులో మాత్రమే కాదు అటు తమిళ పరిశ్రమలోనూ ఎనలేని స్థానం సంపాదించింది. తమిళ సూపర్‌స్టార్‌ ఎంజీఆర్‌తో కలిసి ఏకంగా 26 సినిమాల్లో నటించింది. ఇటు శివాజీ గణేషన్‌తో ‘శెభాష్‌ మీనా’, ‘పుది పరవై’ వంటి సినిమాల్లో కూడా నటించింది. మహాకవి కాళిదాసు చిత్రంలో విద్యాధరి పాత్ర తో ఈమెకు తిరుగు లేదు అనే ముద్ర వేసుకుంది. ఆ పాత్ర చాలా పేరు సంపాదించి పెట్టింది. ఇక తెలుగులో ఆమె చివరిసారిగా నటించిన చిత్రం‘సామ్రాట్‌ అశోక.

అయితే ఈ నటికి 1969లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీతో లభించింది. అటు 1992లో పద్మభూషణ్ పురస్కారం కూడా వచ్చింది. మహాకవి కాళిదాసు చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. పాండురంగ మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, స్వర్గసీతా వంటి చారిత్రక, భక్తి చిత్రాల్లో నటించి తన రేంజ్ ను అమాంతం పెంచుకుంది. సరోజాదేవి మరణించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version