YS Jagan Mohan Reddy: తోడబుట్టిన వాళ్లను ప్రేమగా చూసుకునే కల్చర్ మనదేశంలో అనాదిగా ఉంది. తోడబుట్టిన వాళ్ళ పిల్లలను మరింత ప్రేమగా చూసుకునే బాధ్యత మేనమామ మీద ఉంటుంది. మేనమామ అనేది కేవలం పిలుచుకునే వరుస కాదు. అది రక్త సంబంధాన్ని మించిన బంధం. ఆ బంధాన్ని కాపాడుకుంటే గొప్పగా ఉంటుంది. కానీ, మేనమామ అనే పదానికి వైసీపీ అధినేత జగన్ మాత్రం కొత్త అర్ధాన్ని చెబుతున్నారు.
ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసిపిని నిలబెట్టింది షర్మిల. ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిలబడింది. వైసీపీని బలోపేతం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లి చేసిన త్యాగం జగన్ కు పూచిక పుల్లలాగా మారిపోయింది. చివరికి చెప్పుడు మాటలు విని సొంత చెల్లిని దూరం పెట్టాడు. తండ్రి సంపాదించిన ఆస్తులు ఇవ్వబోనని.. ఇచ్చే అవకాశం కూడా లేదని మెడపట్టి బయటికి గెంటేశాడు. షర్మిల తన కుమారుడి పెళ్లి చేసుకుంటే కనీసం దానికి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు కుమార్తె పెళ్లి చేసుకుంటుంటే.. కనీసం యలహంక ప్యాలెస్ లో పెళ్లి జరగడానికి కూడా జగన్ కు మనసు ఒప్పడం లేదు.
ఒకప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్ 20 విస్తీర్ణంతో ఉండేది. వైయస్ బతికున్నప్పుడు ప్యాలెస్ సందడిగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే ఎవరి వాటాలో వారు హాయిగా ఉండండి అంటూ ఆస్తులు కూడా పంచారు. కానీ, అదే ప్యాలెస్ ఇప్పుడు జగన్ అహంకారానికి.. తోడబుట్టిన సోదరి కన్నీటికి.. కన్నతల్లి నిర్వేదానికి సాక్షిగా కనిపిస్తోంది.
నవంబర్ 25న షర్మిల కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. ఒకవైపు బెంగళూరులో డీకే శివకుమార్.. ఏఐసీసీ ఇన్ చార్జ్ టీవీ మోహన్ లాంటి ప్రముఖులను షర్మిల కలిశారు. సగర్వంగా పెళ్లి పత్రిక ఇచ్చారు. కానీ, తెర వెనుక మాత్రం షర్మిల.. ఆమె తల్లి విజయలక్ష్మి పడుతున్న నరకం మామూలుగా లేదు. అధికారం పోయిన తర్వాత.. కుర్చీ చేజారిపోయిన తర్వాత జగన్ గుండెలో కఠినత్వం ఏమాత్రం తగ్గలేదు. పైగా మేనకోడలు పెళ్లి అని కూడా ఆయన చూడడం లేదు.. అంజలి రెడ్డి వివాహాన్ని.. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో చేసుకుంటుందని.. అది కూడా ఆమె వాటాలోనే జరుపుకుంటుందని విజయలక్ష్మి కోరితే.. అసలు అలాంటి అవకాశం లేదని జగన్ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే సొంత చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసిన చరిత్రను తన పేరు మీద రాసుకున్న జగన్.. ఇప్పుడు మేనకోడలి పెళ్లి విషయంలో కూడా అంతకు మించిన కఠినత్వాన్ని చూపిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో విజయలక్ష్మి పడుతున్న వేదన మామూలుగా లేదు. ఒకవైపు కొడుకు.. మరోవైపు కూతురు.. ఇద్దరు కూడా ఆమె పిల్లలు. తన మనవరాలి పెళ్లి విషయంలో జగన్ ఈ స్థాయిలో కక్షకట్టడాన్ని విజయలక్ష్మి తట్టుకోలేకపోతున్నారు. మౌనంగా రోదిస్తున్నప్పటికీ.. ఆమె రోదన జగన్ కు ఏ మాత్రం పట్టడం లేదు. అన్న చేస్తున్న పనికి షర్మిల రక్తం మరిగిపోతోంది. ఆయన చేతిలో అధికారం లేకపోయినప్పటికీ సొంత సోదరిని ఇలా మానసికంగా వేధించడం జగన్ మనస్తత్వానికి అద్దం పడుతోందని టిడిపి నేతలు అంటున్నారు.