Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Meets Sanaboyina Satyanarayana: ఆ వృద్ధుడిని కలిసేందుకు బయలుదేరిన సీఎం చంద్రబాబు!

Chandrababu Meets Sanaboyina Satyanarayana: ఆ వృద్ధుడిని కలిసేందుకు బయలుదేరిన సీఎం చంద్రబాబు!

Chandrababu Meets Sanaboyina Satyanarayana: ఏపీ సీఎం చంద్రబాబుకు రోజురోజుకు అభిమానులు పెరుగుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆయనకు అభిమానులు పెరిగారు. పాలనాపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తుంది. అలా బాధితుడయ్యారు చంద్రబాబు. దీంతో ఆయనపై ఎక్కువగా వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసేవారు కనిపించేవారు. కానీ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభిమానులు పెరుగుతూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విధానాలతో చంద్రబాబు మరింత హైలెట్ అయ్యారు. చంద్రబాబును జైలులో పెట్టిన సమయంలో ఈ అభిమానం మరింత పొంగింది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమాజంలో కొన్ని వర్గాల వారు విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. తాజాగా ఓ వృద్ధుడు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. దానిపై స్పందించారు చంద్రబాబు. అభివృద్ధిని తప్పకుండా కలుస్తానని చెప్పారు.

విపరీతమైన అభిమానం..
పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సాన బోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం. ఒక్కసారైనా ఆయనను కలవాలని భావించారు. ఈ క్రమంలో ఓ యువకుడు సత్యనారాయణ తో మాట్లాడుతూ వీడియో తీశాడు. చంద్రబాబును ఎప్పుడైనా చూసావా? అని అడగగా అందుకు సత్యన్నారాయణ హైదరాబాద్ వెళితే కనిపిస్తారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబును చూస్తావా? అని అడిగితే.. చూస్తానని సమాధానమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని సిద్ధాంతం గ్రామానికి వస్తున్నారని చెప్పగా.. సత్యనారాయణ ఎంతగానో సంతోషించాడు. తాను చూసేందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు మన ప్రాంతానికి వస్తే కచ్చితంగా చూసి తీరాలని అన్నాడు. ఆ వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సీఎం చంద్రబాబు దృష్టి వరకు వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. అది మరింత వైరల్ గా మారింది.

ఈరోజు పశ్చిమగోదావరిలో పర్యటన..
పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. తొలుత మంగళవారం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు భావించిన.. ఒకరోజు ముందుగానే సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. సీఎం చంద్రబాబు స్పందించిన నేపథ్యంలో ఆ వృద్ధుడు సత్యనారాయణ ను కలిసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు గతం కంటే అభిమానులు పెరగడం విశేషం. ఓ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. అప్పటినుంచి ఆయనపై అనేక రకాల ఆరోపణలు విమర్శలు ఉండిపోయాయి. వాటన్నింటినీ దాటుకుని చంద్రబాబు ప్రజాభిమానాన్ని పెంచుకోవడం నిజంగా విశేషమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version