CM Chandrababu: రాజకీయ నాయకులకు ముందు చూపు చాలా అవసరం.. రెండు మూడు దశాబ్దాల ముందు ఆలోచించాలి. వాటికి అనుగుణంగాణే ప్రాజెక్టులు చేపట్టాలి. పనులు చేయాలి. అప్పుడే సక్సెస్‌ఫుల్ లీడర్ అవుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఊహించిన విజన్ 2020 ప్రణాళిక ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన నాడు ఆలోచించి ఉండకపోతే.. నేడు తెలంగాణ.. బిహార్, యూపీ, రాజస్థాన్ తరహాలో వెనుకబడే ఉండేది. రాజకీయంగా విపక్షాలు ఆయనపై విమర్శలు చేసినా, తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసినా.. వెన్నుపోటు దారుడిగా అపహాస్యం చేసినా.. ఆయన విజన్ మాత్రం పార్టీలకు అతీతంగా అంగీకరించాల్సిందే.
హైటెక్ సిటీతో ఐటీకి బీజం..
ఐటీ రంగం దేశంలోకి రావడానికి రాజీవ గాంధీ బీజం వేశాడు. దానిని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్ ఐటీ రంగానదిదే అని అంచనా వేశారు. దీంతో మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమల స్థాపనకు హైటెక్ సిటీ నిర్మించారు. ఇక అనేక ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇక తెలుగు వారు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలన్న లక్ష్యంతో.. ఇంజినీరింగ్ కాలేజీలు పెంచారు. ఐటీకి అవసరమైన కోర్సులు ప్రారంభించారు. దీంతో లక్షల మంది ఐటీ రంగంలో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అమెరికాలో ఉన్న ఐటీ నిపుణుల్లో పది మందిలో ముగ్గురు తెలుగువారే ఉన్నారంటే కారణం నాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణం.
మెడికల్ కాలేజీలు..
ఇక చంద్రబాబు నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా తీసుకువచ్చారు. 1990కి ముందు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అంటే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఏపీలో నాలుగైదు మాత్రమే ఉండేవి. కాని వైద్య రంగం ఆవశ్యకతను గుర్తించిన చంద్రబాబు… తాను ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. పలు జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయించారు. దీంతో రాష్ట్రంలో వైద్య విద్య చేరువైంది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మరిన్ని కాలేజీలను తీసుకు వచ్చారు.
విజన్‌తోనే పని…
చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఒక విజన్‌తోనే చేస్తారు. దూరదృష్టితో ఆలోచిస్తారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్ బాగుంటుంది అన్న లక్ష్యంతో పనిచేస్తారు. విమర్శలు వచ్చినా పట్టించుకోరు. ఉచిత విద్యుత్ కు కారణం చంద్రబాబే. ఆయన చేసిన సంస్కరణల ఫలితంగానే నేడు ఉచిత విద్యుత్ అందుతోంది.
2047 నాటికి అగ్ర రాష్ట్ర హోదా..
ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ప్రతిష్టాత్మకమైన స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్‌ను రూపొందించారు చంద్రబాబు. దీనిని డిసెంబర్ 12న ఆవిష్కరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేయనుంది. 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్న లక్ష్యంతో రూపొందించిన పత్రాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు ముసాయిదా విజన్ సమగ్రమైన మరియు సమగ్రమైన అభివృద్ధి వ్యూహాన్ని నిర్ధారించడానికి అభిప్రాయాన్ని ఆహ్వానిస్తూ ప్రజలతో పత్రం భాగస్వామ్యం చేయబడింది. స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్ నీతి ఆయోగ్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల నుండి విస్తృతమైన ఇన్‌పుట్‌తో రూపొందించబడింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి వివిధ రంగాల్లోని నిపుణులు, మేధావులు మరియు వాటాదారులతో సహా 17 లక్షల మందికి పైగా ప్రజల నుండి ప్రభుత్వం అభిప్రాయాన్ని సేకరించింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పురోగతి, ఇంధన వనరుల ఆప్టిమైజేషన్, గ్లోబల్–స్టాండర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన ఉత్పత్తికి బ్రాండింగ్ మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో సహా ఈ లక్ష్యాలను సాధించడానికి 10 మార్గదర్శక సూత్రాలను పత్రం వివరిస్తుంది. వద్ధికి కీలకమైన డ్రైవర్‌గా డీప్ టెక్ అడాప్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.