Chandrababu Kuppam South Korea Investment: ఏపీకి ( Andhra Pradesh)భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని మరి ఏపీ విదేశీ పరిశ్రమలను ఆకర్షించగలుగుతోంది. మొన్న ఆ మధ్యన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంస్థ ముందుకు రాక దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయి. తమ రాష్ట్రానికి ఇటువంటి ప్రాజెక్టులు ఎందుకు రాలేదని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. కర్ణాటకలో అయితే పెద్ద చర్చ నడిచింది. కర్ణాటక వంటి పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రాలకు కాకుండా కొత్తగా ఏర్పాటు అయిన ఏపీకి ఎలా ఈ పెట్టుబడులు వెళ్తున్నాయని అక్కడివారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణాటక కు రావాల్సిన గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వెళ్లిపోయిందని అక్కడివారు బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితి తాజాగా తమిళనాడులో కూడా తలెత్తింది. ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్న ఓ పరిశ్రమ ఏపీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ పరిణామంతో తమిళనాడులో గందరగోళ వాతావరణం నెలకొంది.
Also Read: ఐకానిక్ టవర్.. ధీమ్ టౌన్ షిప్.. ఇంటర్నేషనల్ బే సిటీగా విశాఖ
అంతర్జాతీయ సంస్థలకు ఉత్పత్తులు
దక్షిణ కొరియాకు( South Korea) చెందిన ప్రముఖ సంస్థ హ్వాసంగ్ కుప్పంలో సుమారు 150 మిలియన్ల పెట్టుబడులతో నాన్ లెదర్ స్పోర్ట్స్ షూ ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. నైక్, అడిడాస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు షూలను సరఫరా చేసే ఈ సంస్థ కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. ఈ కొత్త యూనిట్ ఏపీని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడి కుప్పం ప్రాంతంలో అభివృద్ధికి ఊతం ఇస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా సంవత్సరానికి 20 మిలియన్ జతల స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనున్నారు. సంబంధిత సంస్థకు ఆసియాలోనే అతిపెద్ద తయారీ కేంద్రాల్లో కుప్పం ఒకటిగా ఉండనుంది.
Also Read:విశాఖ స్టీల్: ఉద్యోగులకు అల్టిమేట్ అని జారీ చేసిన కేంద్రం
పెద్ద ఎత్తున ఉద్యోగాలు..
అంతర్జాతీయంగా మార్కెట్లో ఉన్న గిరాకీ కి తగ్గట్టు ఉత్పత్తి అందించేందుకు ఈ యూనిట్ ఎంతగానో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్ నెలకొల్పితే భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఏపీ ఎగుమతుల్లో కూడా గణనీయమైన పెరుగుదల సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 20వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించునున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాంత యువతకు ఇదో చక్కటి అవకాశం. స్థానిక మహిళలకు కూడా ఉపాధి లభించే ఛాన్స్ కనిపిస్తోంది. గతంలో తమిళనాడుతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. హ్వాసంగ్ ఇప్పుడు ఏపీని ఎంచుకుంది. కూటమి ప్రభుత్వ సానుకూల విధానాలు, సౌకర్యాలు ఈ విషయంలో కీలకంగా నిలిచాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏర్పాటు అవుతుండడంతో యంత్రాంగం సైతం ప్రత్యేక ఆసక్తి చూపుతోంది.