Visakhapatnam: విశాఖపట్నంపై( Visakhapatnam) ప్రత్యేకంగా దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరాన్ని నిలబెట్టాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ పరిశ్రమలు ఏపీ వైపు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. మరో 10 ఏళ్లలో విశాఖ నగరం స్వరూపం మారనుంది. అందుకు తగ్గట్టుగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భారీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించింది. నగరాన్ని అంతర్జాతీయ స్థాయి బే సిటీగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణలను సిద్ధం చేసింది.
* కైలాసగిరి చెంతన 50 అంతస్థుల్లో కైలాసగిరిలో( Kailasagiri ) ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది వి ఎం ఆర్ డి ఏ. తాజాగా 87 ఎకరాల్లో 50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని ప్రకటించింది. మరోవైపు నగర శివారు ప్రాంతమైన కొత్త వలసలు 12 ఎకరాల ధీమ్ ఆధారిత టౌన్షిప్ కూడా అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి పట్టణాభివృద్ధి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కైలాసగిరి కింద భాగంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా 87 ఎకరాల్లో 50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఈ టవర్ పర్యాటక రంగం తో పాటు రియల్ ఎస్టేట్ రంగం ప్రాధాన్యతను పెంచడానికి దోహదపడనుంది. ఈ టవర్ లో లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, క్లబ్ హౌస్, జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
* అత్యున్నత రెసిడెన్షియల్ భవనాల్లో ఒకటిగా..
అయితే ఈ టవర్ నిర్మాణం పూర్తయితే ఏపీలోని అత్యున్నత రెసిడెన్షియల్ భవనాల్లో ఒకటిగా నిలవనుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. మరో రెండు నెలల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుకానుంది. మరోవైపు కొత్తవలసలో 120 ఎకరాల్లో ధీమ్ ఆధారిత టౌన్ షిప్ ఏర్పాటు కానుంది. ఐటీతోపాటు ఇన్నోవేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దీనిని నిర్మించనున్నారు. విశాఖ ప్రపంచంలోనే మేటి నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ నగరం పర్యాటకంగా దేశంలో సుపరిచితంగా మారింది. ఏపీ ప్రభుత్వం వాణిజ్య రాజధానిగా విశాఖను గుర్తించింది. ఇప్పటికే రాష్ట్రం తరఫున అన్ని రకాల కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది విశాఖ. ఒకవైపు పరిశ్రమల ఏర్పాటు, ఇంకోవైపు ఐటీ హబ్ గా మారడం, పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పిస్తుండడంతో విశాఖ అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశం ఉంది.