Chandrababu : కుప్పం( Kuppam) అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నట్టు పరిస్థితి మారింది. 1989 నుంచి ఇప్పటివరకు ఆయన కుప్పం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన సొంత గ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. కానీ స్థానికేతరుడైన చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు కుప్పం ప్రజలు. అయితే విపక్షాల నుంచి విమర్శలు వస్తుండడంతో పాటు స్థానికత అంశం ప్రతిసారి చర్చకు దారితీస్తుండడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కుప్పంలో సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగింది. ప్రస్తుతం ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈనెల 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదన్న విమర్శలకు చెక్ చెబుతూ శివపురంలో నూతన గృహంలోకి అడుగుపెట్టనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అమరావతి రాజధానిలో సొంతింటి నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇల్లు అందుబాటులోకి వచ్చింది.
Also Read : చంద్రబాబు హెలిక్యాప్టర్ ఫిట్నెస్ పై అనుమానాలు.. అధ్యయనానికి కమిటీ!
* ఆ విమర్శలకు చెక్..
సుదీర్ఘకాలం కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు చంద్రబాబు( CM Chandrababu). అయితే ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేదంటూ చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావించారు. మూడేళ్ల కిందట శివపురంలో నూతన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం తో పాటు కార్యాలయం సైతం అందుబాటులోకి రావడంతో కుప్పం నియోజకవర్గ టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
* కుప్పం టిడిపి శ్రేణులకు సమాచారం..
సీఎం చంద్రబాబు ఈనెల 25న కుప్పం రానున్నారు. శివపురం( sivapuram) దగ్గర నూతన గృహప్రవేశం కుటుంబ సభ్యులతో చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని హై కమాండ్ నుంచి కుప్పం నియోజకవర్గ టిడిపి నేతలకు సమాచారం వచ్చింది. కడపల్లె పంచాయితీ శివపురం వద్ద కుప్పం- పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో కొత్త ఇంటిని నిర్మించారు చంద్రబాబు. దాదాపు ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈనెల 25న గృహప్రవేశం చేయనున్నారు. 2019 ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు కనీసం ఇల్లు లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పంలో సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు. ఎకరా స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. స్థానిక టిడిపి నేతలతో పాటు నారా భువనేశ్వరి ఇంటి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. మూడేళ్ల తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో వేడుకగా గృహప్రవేశం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ టిడిపి శ్రేణులకు ఈ వేడుకల్లో పెద్దపీట వేయనున్నారు.
Also Read : చంద్రబాబు మాటంటే మాటే.. వారిద్దరికీ అనూహ్య పదవులు!
* అమరావతిలో సువిశాలంగా..
ఇటీవల అమరావతిలో( Amravati capital ) సైతం కొత్త ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ 9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టగా.. కుటుంబ సమేతంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత ఆ భూమిని చదును చేశారు. కొత్త ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో ప్లాన్ చేశారు. పనులు పూర్తిచేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి అయితే సీఎం చంద్రబాబు అటు సొంత నియోజకవర్గం కుప్పం, ఇటు రాజధాని అమరావతిలో సైతం సొంత ఇంటి కల సాకారం కానుందన్నమాట.