https://oktelugu.com/

Chandrababu: అమిత్ షాను అడుక్కుంటున్నావా? అన్న జర్నలిస్ట్ పై ‘బాబు’ సీరియస్.. వైరల్ వీడియో

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతాన్ని సందర్శించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చారు.

Written By: , Updated On : March 9, 2024 / 02:57 PM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా రికార్డేడే. ఏ విషయమైనా సరే, ఏ సంఘటనైనా సరే.. మిగతా వారేమో కానీ.. ఇటువంటి విషయాలలో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అభాసు పాలు కాక తప్పదు. ప్రస్తుతం ఓ వీడియోను వైసిపి అనుకూల సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఎన్నికల వాతావరణం ఎలా ఉండడంతో ఈ వీడియో తెగ చర్చనీయాంశంగా మారింది.

అప్పట్లో రాళ్లదాడి

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతాన్ని సందర్శించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అప్పటిదాకా టిడిపి, బిజెపి మధ్య పొత్తు ఉండేది. 2014 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి కూడా వచ్చాయి. అప్పట్లో ఎక్కడ తేడా జరిగిందో తెలియదు గానీ మొత్తానికి టిడిపి, బిజెపి కటీఫ్ చెప్పుకున్నాయి. ఫలితంగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఇక 2019లో జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాదు అని భావించిన చంద్రబాబు.. ఆ పార్టీ పెద్దలపై యుద్ధాన్ని ప్రకటించారు. తిరుపతి సందర్శన కోసం అమిత్ షా వస్తే టిడిపి నాయకులు రాళ్లతో ఆయన కాన్వాయ్ పై దాడి చేశారు. నల్ల బెలూన్లు ఎగరేశారు. అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓ వర్గం మీడియా దీనిని తెగ ప్రచారం చేసింది. ఆ తర్వాత బిజెపి అధికారంలోకి రావడం.. టిడిపి ప్రతిపక్షంలోకి వెళ్లిపోవడం జరిగాయి.

ఇప్పుడు పొత్తు..

అప్పట్లో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు వేసిన తర్వాత కొంతకాలం వరకు టిడిపి, బిజెపి మధ్య సత్సంబంధాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఆయన కుమారుడు లోకేష్ అమిత్ షాను కలవడంతో.. రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ నేపథ్యంలో ఇటీవల సీట్ల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇద్దరు సుదీర్ఘంగా మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి మీరు సీట్ల కోసం అమిత్ షాను అడుక్కుంటున్నారా అని ప్రశ్నిస్తే.. దానికి చంద్రబాబు తన స్టైల్లో సమాధానం చెప్పారు. అమిత్ షా ఎవరు? నేను పడుకుంటున్నానా? నేను 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాను. నాకు అడుక్కోవలసిన ఖర్మ పట్టలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే దీనిని వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. రాసేందుకు వీలుపడని పదంతో సంబోధిస్తూ.. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరంటూ వ్యాఖ్యానిస్తోంది. అయితే దీనికి తగ్గట్టుగానే టిడిపి అనుకూల సోషల్ మీడియా కూడా జగన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల తాలూకూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. మొత్తానికి అటు టిడిపి, ఇటు వైసిపి సోషల్ మీడియాలో పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి.