CM Chandrababu : ఏపీలో రహదారులు దారుణ పరిస్థితికి చేరుకున్నాయి. వైసీపీ కేవలం సంక్షేమ పథకాల విషయంలోనే దూకుడు కనబరిచింది.రహదారుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. వైసిపి ఓటమికి కూడా అదే ప్రధాన కారణం అయ్యింది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. గుంతలు లేని రోడ్లను సంక్రాంతి నాటికి చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సంబంధించి కార్యాచరణను ఈరోజు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఏపీలో గత ఐదేళ్ల వైసిపి హయాంలో రోడ్ల దుస్థితి జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. చిన్నచిన్న రోడ్లకు సైతం గుంతలు పూడ్చలేని పరిస్థితి రావడంతో పురుగు రాష్ట్రాల నేతలు జోకులేసుకునే స్థాయికి వెళ్ళింది. అయినా సరే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే నాటి రోడ్డు స్థితిగతులపై విమర్శలు చేయడంలో కూటమి పార్టీలు ముందుండేవి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అప్పటి ప్రభుత్వం పై వ్యతిరేకతకు ఇదే కారణం అయ్యింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారుల అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభించింది.
* విశాఖలో శ్రీకారం
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు విజయనగరంలో మిషన్ గుంతలు లేని ఏపీ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.కానీ విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది.దీంతో జిల్లా వ్యాప్తంగాఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో సీఎం విజయనగరం పర్యటన వాయిదా పడింది. ఈ తరుణంలో విశాఖ జిల్లాలో రోడ్ల అభివృద్ధి మిషన్ ను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా వెన్నెల పాలెం లో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ గుంతలను పూడ్చడం ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
* సంక్రాంతికి పూర్తిచేయాలని లక్ష్యం
ఇప్పటికే పల్లె పండుగ పేరుతో పంచాయితీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్రాంతి నాటికి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులను చూడాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతానికి గుంతలు పూడ్చి.. అటు తరువాత బాగా దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొత్తానికైతే గత ఐదేళ్ల వైసిపి హయాంలో చేయలేని పనులను.. చేసి చూపించాలని కూటమి ప్రభుత్వం ఆరాటపడుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu is ready to undertake repairs of roads across the state in the name of mission path hole free ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com