Homeఆంధ్రప్రదేశ్‌AP Film Corporation chairman: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే.. పవన్ కళ్యాణ్...

AP Film Corporation chairman: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే.. పవన్ కళ్యాణ్ ప్రతిపాదన!

AP Film Corporation chairman: ఏపీలో ( Andhra Pradesh)కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే కీలకమైన కొన్ని పదవులను ఇంతవరకు భర్తీ చేయలేదు. అందులో సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు నామినేట్ చేయలేదు. తెలంగాణలో మాత్రం భర్తీ చేశారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించారు. అయితే ఏపీ విషయంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.

Also Read: బాలయ్యకు ‘మానసిక’ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ చెప్పిన నిజాలు

ఏపీ వైపు చూడని సినీ ప్రముఖులు..
ఏపీలో కూటమి( alliance) అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. అయితే సినీ పరిశ్రమలోనే కొందరు వ్యక్తులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఏపీ సీఎం చంద్రబాబును సినీ పెద్దలు కలవలేదు. దానిని తప్పు పట్టారు పవన్ కళ్యాణ్. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల ప్రకటన తర్వాత.. థియేటర్ల బంద్ ప్రకటన తెరపైకి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ సినీ పరిశ్రమ పెద్దల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడంపై తప్పు పట్టారు. అయితే ఈ ఘటనతో సినీ పరిశ్రమలోని చాలామంది పెద్దలు ఏపీ ప్రభుత్వంతో విభేదిస్తున్నారని వార్తలు వచ్చాయి.

సినీ పెద్దల తీరుపై ఆగ్రహం..
అయితే మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమ( Telugu cinema industry) అంతా తెలంగాణలో ఉంది. ఏపీకి విస్తరించడం లేదు. అందుకే సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని లెక్కచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు దీనిపై ప్రకటన చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన నిర్మాత ఏఎం రత్నం కు ఆ పదవి ఇవ్వాలని తాను సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించినట్లు ప్రకటించారు. అయితే ఈ పదవిపై చాలామంది ఆశలు పెంచుకున్నారు. వాటన్నింటినీ తెరదించుతూ ఓ నిర్మాత పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం మాత్రం సంచలనంగా మారింది.

Also Read: ’హరిహర వీరమల్లు’ పై ఎందుకింత నెగెటివిటీ?

ఎన్నెన్నో హిట్ చిత్రాలు..
దక్షిణాది రాష్ట్రాల్లో సుపరిచితులు ఏఎం రత్నం( Ratnam) . ఆయన ఎన్నెన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా ప్రవేశించారు రత్నం. తర్వాత నిర్మాతగా మారారు. దర్శకత్వం కూడా చేశారు. శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఆయన తెలుగులో తొలిసారిగా చేసిన చిత్రం ధర్మ యుద్ధం. పవన్ కళ్యాణ్ తో ఈయనది హిట్ కాంబినేషన్. ఖుషి, బంగారం, ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రాలను రూపొందించారు రత్నం. తెలుగు చిత్రాలకు సంబంధించి కర్తవ్యం, పెద్దరికం, సంకల్పం, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుల రోజు, స్నేహం కోసం, నాగ, 7g బృందావన్ కాలనీ, నీ మనసు నాకు తెలుసు చిత్రాలను రూపొందించారు. అయితే ఇప్పటివరకు ఏఎం రత్నంకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. అటువంటి వ్యక్తికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ ప్రతిపాదించడం మాత్రం నిజంగా సంచలనమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular