https://oktelugu.com/

CM Chandhrababu : ఓ ఇద్దరు సామాన్యుల కోసం విలువైన సమయాన్ని కేటాయించిన చంద్రబాబు.. ఇంతకీ వారు ఎవరంటే?

చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ అధినేతగా పాలనను గాడిలో పెడుతూనే.. విలువైన సమయాన్ని పార్టీకి కేటాయిస్తుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 9, 2024 / 01:34 PM IST
    Follow us on

    CM Chandhrababu : దేశంలోనే తెలుగుదేశం పార్టీది సుదీర్ఘ నేపథ్యం. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం విశేషం. క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి లేనంత బలం దాని సొంతం. అందుకే కిందకు పడిన ప్రతిసారి.. పైకి కెరటంలా లేస్తోంది ఆ పార్టీ. దానికి కారణం ఆ పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలం.ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి.. సుదీర్ఘంగా అధినేతగా కొనసాగుతున్నారు చంద్రబాబు.ఓటమి ఎదురైన ప్రతిసారి కార్యకర్తలను తట్టి లేపుతున్నారు.పోరాటంలో నిలుపుతున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది.కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక టిడిపి పని అయిపోయిందని అంతా భావించారు.కానీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడారు. అలుపెరగని పోరాటం చేశారు. అధినేత ఇచ్చిన పిలుపునకు ఎన్నికల్లో గట్టిగానే కృషి చేశారు.దాని ఫలితంగానే తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 134 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపులో పార్టీ శ్రేణులదే భాగస్వామ్యం.అందుకే వారికి పెద్దపీట వేయాలని చంద్రబాబు భావించారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిడిపి కార్యకర్తలకు ప్రస్తుతం రూ. 2 లక్షలు గా ఉన్న ప్రమాద బీమాను ఐదు లక్షలకు పెంచారు. రాష్ట్రంలో కార్యకర్తలందరికీ బీమా వర్తించేలా చూస్తానని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవులతో టిడిపి శ్రేణుల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.1995 మాదిరిగా పనిచేస్తానని.. తాను నాయకుడిగా గుర్తింపు తెచ్చి పెట్టిన జన్మభూమి పథకాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.

    * ఒక ఫ్యాక్టరీలా టిడిపి
    టిడిపి ఆవిర్భావం తర్వాత వందలాదిమంది వెనుకబడిన తరగతులకు చెందిన నేతలు ఉద్భవించారు. టిడిపి ఆవిర్భావంతో బీసీ నేతలకు అవకాశాలు వచ్చాయి.నేతలను తయారు చేసే ఫ్యాక్టరీలా టిడిపి మారింది. అటు సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక నాయకులు తెలుగుదేశం పార్టీ సొంతం. ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. నవ్యాంధ్రప్రదేశ్ లో అయినా.. తెలంగాణలో అయినా.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. కానీ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా గెలుపోటములు చవిచూస్తోంది ఆ పార్టీ. కానీ ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలు మనగలగడం వెనుక క్షేత్రస్థాయిలో బలం ఒక ప్రధాన కారణం. అందుకే దానిని పెంచుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు.

    * సచివాలయానికి ఓ ఇద్దరూ
    తాజాగా సచివాలయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిత్యం పని బిజీలో ఉండే చంద్రబాబు ఓ ఇద్దరు సామాన్య వ్యక్తులను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారికోసం విలువైన సమయాన్ని కేటాయించారు. దీంతో వారు ఎవరు అయి ఉంటారని అంతా భావించారు. సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు అని తెలియడంతో ఆరా తీయడం ప్రారంభించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దెందులూరు కు చెందిన దుర్గాదేవి, వినుకొండ కు చెందిన శివరాజు యాదవ్ అనుసరించేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కనిపించేవారు. చివరకు చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా.. వీరిద్దరూ అక్కడే గడిపారు. దీనిని గమనించిన చంద్రబాబు ప్రత్యేకంగా వారిని పిలిచి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం ఆరా తీశారు. తద్వారా చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ఎంత విలువ ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోయింది. టిడిపి అధినేతగా వారంలో ఒకరోజు పార్టీ కోసం చంద్రబాబు కేటాయిస్తున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

    * మార్పునకు కారణం అదే
    2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడు పాలనాపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పార్టీ వ్యవహారాలు చూసింది అంతంత మాత్రమే. 2019 ఎన్నికల్లో ఆ ప్రభావం పడింది. దారుణ ఓటమి ఎదురైంది.ప్రస్తుతం ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.ముందుగానే మేల్కొంటున్నారు. పాలనతో పాటు పార్టీకి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు