Murari Re-release Record : సినీ ఇండస్ట్రీలో కొత్త సినిమాలు రావడం తక్కువవతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించడంతో పాటు పలు కారణాల వల్ల కొత్త సినిమాను తీసేందుకు కొందరు డైరెక్టర్లు ముందుకు రావడం లేదు. అయితే ఓటీటీని బేస్ చేసుకొని వెబ్ సిరీస్ లను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ లో జోష్ పెంచేందుకు రీ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్మురేపిన సినిమాలను మళ్లీ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా ఆ సినిమాలో రిలీజ్ అయిన సమయంలో తెలియని నేటి యూత్ హీరోల పాత సినిమాలను చూసి ఇంప్రెస్ అవుతున్నారు. గత ఏడాది కింద పవన్ కల్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తరువాత బాలకృష్ణ మూవీని మళ్లీ థియేటర్లకు తీసుకొచ్చారు. వీటిల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సైతం మళ్లీ థియేటర్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయం సాధించింది. మళ్లీ దీనిని విడుదల చేసినా రికార్డు బ్రేక్ చేసింది. ఊహించని కలెక్షన్లు రావడంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది. అయితే ఇలాంటి సినిమానే ఇప్పుడు మరో మూవీ బీట్ చేసింది. అంతకుమించి అన్నట్లు ఆ సినిమా విడుదలకు ముందే బంపర్ బుకింగ్స్ అయ్యాయి. అదే మురారి. మహేష్ బాబు నటించిన మురారి సినిమాను ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఇప్పటికే ఎలాంటి రికార్డు సాధించిందో తెలుసా?
కృష్ణవంశీ డైరెక్షన్లో మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయింది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా సోనాలి బింద్రే నటించారు. వీరితో పాటు సుకుమారి, లక్ష్మీ, గొల్లపూడి మారుతిరావు,చ సత్యనారాయణ తదితరులు నటించారు. 19వ శతాబ్దంలో ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అతని కటుుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఈ సినిమా ద్వారా చూపించారు. అప్పట్లో ఈ సినిమా పోస్టర్లపై ‘ప్రారంభం మిస్ కావొద్దు’ అని క్యాప్షన్ పెట్టడంతో సినీ ప్రేక్షకులు ఆసక్తిగా వెళ్లారు. సినిమా నచ్చడంతో మళ్లీ మళ్లీ చూశారు.
అయితే ఈ మూవీని ఇప్పుడు రి రీలీజ్ చేయనున్నారు. ఆగస్టు 9న థియేటర్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ రీ రిలీజ్ కుముందే ఈ మూవీ రికార్డు బద్దలు కొట్టింది. రీ రిలీజ్ సందర్భంగా సాధారణ కలెక్షన్లు వస్తాయని అనుకున్నారు. కానీ ఏకంగా దీని బుకింగ్స్ లక్షా 40 వేల రేంజ్ లో ఉండడంతో షాక్ కు గురవుతున్నారు. 25 ఏళ్ల ముందు వచ్చిన సినిమా కూడా ఇంత రచ్చ చేయడం మామూలు విషయం కాదని అంటున్నారు.
రీ రిలీజ్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి 12.1 వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ సొంతం చేసుకుంది. కానీ మురారి మాత్రం 15 వేల ఆస్త్రేలియన్ డార్ల మార్క్ దాటడం విశేషం. రెండో సారి రిలీజ్ అయిన సినిమాల్లో ప్రస్తుతానికైతే మహేష్ సనిమానే హైయ్యెస్టుగా నిలుస్తోంది. మరి ఈ సినిమాను బీట్ చేయడానికి ఎవరు వస్తారో చూడాలి. ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్లు థియేటర్లో సినిమాతో సందడి చేస్తున్నారు.బర్త్ డే సందర్భంగా మూవీని రిలీజ్ చేయడం కలెక్షన్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే టోటల్ ఎంత వసూలు ఉంటుందో చూడాలి.