spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP New Pensions: 15 లక్షల కొత్త పింఛన్లు.. చంద్రబాబు సర్కార్ సాహసం!

AP New Pensions: 15 లక్షల కొత్త పింఛన్లు.. చంద్రబాబు సర్కార్ సాహసం!

AP New Pensions: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు ఇవ్వాలని భావిస్తోంది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ,ఎస్టీ వారికి సైతం పింఛన్లు అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగా.. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే జరిగితే దేశంలోనే ఏపీ సంక్షేమ పథకాల పరంగా రికార్డు క్రియేట్ చేసినట్టే.

* అదనంగా రూ.700 కోట్ల భారం..
ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, కిడ్నీ సంబంధిత రోగులు, డప్పు కళాకారులు, చర్మకారులు వంటి విభాగాల్లో పింఛన్లు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షలకు పైగా పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు గాను నెలవారీగా రూ. 2,700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఏడాదికి 41 వేల కోట్ల రూపాయలు భారం పడుతోంది ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు అదనంగా 15 లక్షల పింఛన్లు అందించాలని నిర్ణయించడం విశేషం. ఇప్పటినుంచి అదనంగా 700 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది రాష్ట్ర ప్రభుత్వంపై. తాము అధికారంలోకి వస్తే కొత్త పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోజ్ కోటా కింద పింఛన్లు అందజేశారు. వివిధ రుగ్మతలతో బాధపడే వారికి వాటిని అందజేశారు. అయితే ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ పథకం ఇంకా అమలు కాలేదు. దానికోసమే ఎక్కువ మంది ఎదురుచూస్తూ వచ్చారు.

* బకాయిలతో సహా చెల్లింపులు..
అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు అందిస్తామన్న హామీ ఎట్టకేలకు తీరనుంది. కానీ తాము అధికారంలోకి వస్తే.. మూడువేల రూపాయలు ఉన్న సామాజిక పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇచ్చిన హామీని 2024 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. చెప్పిన మాదిరిగే అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ నెలలో మూడు నెలల బకాయిలతో సహా చెల్లింపులు చేశారు. అయితే నవరత్నాల్లో భాగంగా పింఛన్లు అందిస్తామని ఇచ్చిన హామీని రెండేళ్ల తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థికపరంగా అధ్యయనం చేశారు. అది ఒక కొలిక్కి రావడంతో.. ఇప్పుడు పింఛన్లు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నమాట. అయితే ప్రభుత్వ ప్రణాళికతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper