Chandrababu Emotional Tweet: కొందరికి మాత్రమే అరుదైన అవకాశం, గుర్తింపు ఉంటుంది. అటువంటి గుర్తింపు పొందారు నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ). ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి భార్య, మరో మంత్రి తల్లి, ఓ జాతీయ పార్టీ అధ్యక్షురాలి సోదరి, మరో సీనియర్ ఎమ్మెల్యే సోదరి. అయితే ఆమె సాధారణ గృహిణి గానే ఉండేందుకు ఇష్టపడతారు. అలానే ఉన్నారు. ఓ దిగ్గజ వ్యాపార సంస్థను ఒంటి చేత్తో నడిపారు. ప్రస్తుతం తన తండ్రి పేరిట ట్రస్ట్ నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. మొన్నటికి మొన్న తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏకంగా ఒక మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించి భారీగా నిధులు సమీకరించారు. ఈరోజు నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. భర్త చంద్రబాబుతో పాటు కుమారుడు లోకేష్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ మూడో కుమార్తెగా..
నందమూరి తారక రామారావు( Nandamuri taraka Rama Rao ) కుమార్తె నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. అందులో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా.. లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ఇందులో నారా భువనేశ్వరి కి చంద్రబాబుతో వివాహం జరిగింది. ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు విజయవంతంగా నడపగలిగారు. అయితే ప్రతి విజయం వెనుక నారా భువనేశ్వరి ఉన్నారని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాజాగా ఈరోజు భువనేశ్వరి పుట్టినరోజు కావడంతో భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చంద్రబాబు. అది విపరీతంగా వైరల్ అయ్యింది.
చంద్రబాబు విషెస్
‘ భువనేశ్వరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రేమ, మీ బలం మా కుటుంబానికి పునాది లాంటిది. జీవితంలో ఎత్తు పల్లాల్లో మీరు నాకు తోడుగా ఉన్నారు. మీరు నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టం. మీరు మా జీవితాల్లో వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీ శ్రద్ధ, వ్యాపారంలో, దాతృత్వంలో మీ నాయకత్వం అందరికీ స్ఫూర్తినిస్తాయి. మీలోని గొప్ప లక్షణాలు ఎన్నో నన్ను ఆకర్షిస్తాయి. నీ పుట్టినరోజు వేడుకను సంతోషంగా జరుపుకుందాం ‘ అన్నారు చంద్రబాబు.
Also Read: Nara Bhuvaneswari – Lokesh: ‘బాబు’ కోసం లోకేష్, భువనేశ్వరి సహా అంతా మౌన రోదన
లోకేష్ విషెస్
మరోవైపు మంత్రి లోకేష్( Lokesh) కూడా తల్లి భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.’ అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నా బలం. మీరు నాకు మార్గ నిర్దేశం చేశారు. మా కుటుంబానికి మీరే గుండె లాంటి వారు. నన్ను ఎన్నో విధాలుగా తీర్చిదిద్దారు. నీ ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీరు నా బలం, నా మార్గదర్శి. మీరు నాకు నేర్పిన మంచి విషయాలకు నేను కృతజ్ఞుడను. మీరు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. మీకు అన్నివేళలా ప్రేమ దొరకాలని భావిస్తున్నాను. ఈ సంవత్సరం మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను ‘ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషెస్ వైరల్ అవుతున్నాయి.
Happy birthday, Bhuvaneshwari! Your love and strength are the foundation of our family. You have been by my side through every high and low, and I am truly grateful to have you as my partner in life. You are the light of our lives. Your grace, your care for people, and your… pic.twitter.com/votGk4tLjE
— N Chandrababu Naidu (@ncbn) June 20, 2025