Chandrababu Birthday: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన చంద్రబాబుకు జాతీయస్థాయిలో సైతం ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబుకు విషెస్ చెబుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందు ట్వీట్ చేసిన క్యాప్షన్ ను ఎడిట్ చేసి ఒక్క పదం యాడ్ చేయడంతో జగన్ ట్రోలింగ్ కు గురవుతున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Also Read: పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన శ్రీరెడ్డి..త్వరలోనే అరెస్ట్ కి రంగం సిద్ధం!
* ప్రధాని ప్రత్యేక ట్వీట్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ‘ నా స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి శుభాకాంక్షలు. భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కూడా ఆసక్తిగా మారింది. ‘ ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై.. శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం నారా చంద్రబాబునాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాథునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.
* ఆ ఒక్క పదం యాడింగ్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చర్చకు దారితీస్తోంది. ఒక్క పదంతో ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం ట్విట్టర్ ఎక్స్ లో చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు జగన్. ‘ చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్తో జీవించాలని కోరుకుంటున్నాను. అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే అక్కడికి కొద్దిసేపటి తర్వాతే ట్వీట్ను ఎడిట్ చేశారు. చంద్రబాబు పక్కన గారు అని రాసుకొచ్చారు. ఈ ఒక్క పదమే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి చేసింది. జగన్మోహన్ రెడ్డిని చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు.
Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025