Homeఆంధ్రప్రదేశ్‌IAS Praveen Prakash: అంతా ముంచేసి.. ఇప్పుడు పశ్చాత్తాపమా ప్రవీణ్ ప్రకాష్?

IAS Praveen Prakash: అంతా ముంచేసి.. ఇప్పుడు పశ్చాత్తాపమా ప్రవీణ్ ప్రకాష్?

IAS Praveen Prakash: ప్రవీణ్ ప్రకాష్.. జగన్ అస్మదీయ అధికారి. అత్యంత వీర విధేయుడు. జగన్ ముందు వంగి వంగి నమస్కారాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఈయన.. గత ఐదేళ్ల వైసిపి పాలనలో మాత్రం ఎన్నెన్నో విమర్శలను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఇబ్బంది పెట్టారన్న అపవాదులు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో అంటగాకినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈయనపై వేటు పడింది. సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది. అయితే ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు ప్రవీణ్ ప్రకాష్. పాఠశాల విద్యాశాఖలో తాను ఎవరిని అవమానించలేదని.. ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని పశ్చాత్తాపం ప్రకటించారు ఆయన.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవీణ్ ప్రకాష్ కు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. కీలకమైన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే విద్యాసంస్కరణలో భాగంగా విద్యా శాఖలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. అయితే పూటకో జీవో, ఉత్తర్వులతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి నెల ఒక జిల్లాను సందర్శించి హడలెత్తించారు ప్రవీణ్ ప్రకాష్. అధికారులపై బదిలీ వేటు వేయడం, చర్యలు తీసుకోవడం, ఉపాధ్యాయులను తప్పు పట్టడం, ఆకస్మిక తనిఖీలు.. ఇలా ఒకటేమిటి చాలా విద్యలు ప్రదర్శించారు ప్రవీణ్ ప్రకాష్. కనీసం విద్యాశాఖ అధికారుల వెర్షన్ కూడా వినేవారు కాదు. అప్పటికప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమించేవారు. అయితే ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ముద్రపడ్డారు. వారిపై ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ప్రభుత్వం కక్ష సాధించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు కీలక అధికారులపై వేటు పడింది. అందులో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు. గత ఐదేళ్లుగా ప్రవీణ్ ప్రకాష్ తీరుతో ఇబ్బంది పడిన బాధితులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు.’ గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించాను అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్ధ్యాలు పెంచేందుకే అలా మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’ అని వీడియోలో స్పష్టం చేశారు.

అయితే వైసీపీ సర్కార్లో కీలక అధికారులు చేసిన పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం వెనుక ప్రవీణ్ ప్రకాష్ చర్యలు ఉన్నాయి. ఆయన తీరుతో విసిగి వేశారి పోయిన వారు ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోయారు. ఆయన చర్యల పుణ్యమా అని వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా.. పార్టీ పరంగా వైసిపికి, వ్యక్తిగతంగా ప్రవీణ్ ప్రకాష్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version