కేంద్రం తెలుగు మాట.. ఏపీ సర్కారు ఇంగ్లిష్ బాట

  దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాంటారు. మాతృ భాషలో ప్రావీణ్యం లేని వాడు వేరే భాషల్లో రాణించడం కష్టమే. పక్కనున్న తమిళనాడు, కర్ణాటక స్టేట్లు తమ భాషాభివృద్ధికి పాటుపడుతుంటే మన తెలుగు వారు మాత్రం తెలుగుకు తెగులు పట్టిస్తున్నారు. దీంతో భాషాభివృద్ధి చెందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు. ఇద్దరు కర్ణాటక వారు కలుసుకుంటే వారు కన్నడంలోనే మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వారు […]

Written By: Srinivas, Updated On : July 18, 2021 3:40 pm
Follow us on

 

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాంటారు. మాతృ భాషలో ప్రావీణ్యం లేని వాడు వేరే భాషల్లో రాణించడం కష్టమే. పక్కనున్న తమిళనాడు, కర్ణాటక స్టేట్లు తమ భాషాభివృద్ధికి పాటుపడుతుంటే మన తెలుగు వారు మాత్రం తెలుగుకు తెగులు పట్టిస్తున్నారు. దీంతో భాషాభివృద్ధి చెందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు. ఇద్దరు కర్ణాటక వారు కలుసుకుంటే వారు కన్నడంలోనే మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వారు కలిస్తే ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారనే హాస్యం ఉంది.

తెలుగులో బీటెక్ విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగులో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి అనుమతి ఇచ్చేశారు. ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం పదకొండు భాషల్లో ఆయా స్టేట్లలో బీటెక్ కోర్సుల్లో ఆ భాషలోనే చెప్పుకునేలా అవకాశం కల్పించారు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ నిబద్దతతో ఉన్నారు. మిగతా స్టేట్ల సంగతి ఏమో కానీ ఏపీలో మాత్రం బీటెక్ తెలుగు మీడియం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్లమే సర్వస్వం అయ్యేలా అన్ని విషయాల్లో ఇంగ్లిష్ నే అమలు చేస్తోంది. తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయాలని చూస్తోంది. దీంతో తెలుగులో పాఠాలే చెప్పుకోనవసరం లేదు. ఎల్కేజీ నుంచి అన్ని తరగతుల్లో ఇంగ్లిష్ లోనే పాఠాలు బోధించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ర్టంలో బీటెక్ తరగతులు తెలుగులో చెప్పేందుకు, తెలుగులోనే పరీక్షలు రాసేందుకు అనుమతించడం ఆహ్వానించదగ్గ విషయమే. ఇప్పటి వరకు డిగ్రీ వరకు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉండేది.

వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో కూడా ఆంగ్లమే. ఇది తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోంది. చాలా కాలంగా దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకునే వారు లేరు. కేంద్రం అనేక కమిటీలు వేసి పరిశీలనలు చేయించి చివరికి బీటెక్ లో తెలుగు మాధ్యమం అవకాశం కల్పించడం సమంజసమే. దీంతో పక్క స్టేట్ల వారు తమ మాతృభాషపై మక్కువతో అమలు చేసేందుకు ముందుకు వచ్చినా ఏపీ మాత్రం తెలుగు మాధ్యమాన్ని అమలు చేసేందుకు పట్టించుకుంటుందో లేదో చూడాల్సిందే.