https://oktelugu.com/

ViVeka Case – CBI : వివేకా హత్య కేసు నుంచి సీబీఐ ‘అవుట్’

తనకు సైతం కడప రాజకీయాలపై ఆసక్తి లేదని వివేకాకు షర్మిళ చెప్పారని కూడా చార్జిషీటులో చెప్పుకొచ్చింది. మొత్తానికైతే గతానికి భిన్నంగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు విచారణ నుంచి సీబీఐ ఔట్ అయినట్టు కనిపిస్తోంది. 

Written By:
  • Dharma
  • , Updated On : July 21, 2023 / 02:33 PM IST
    Follow us on

    ViVeka Case – CBI : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు. ఇప్పటివరకూ దూకుడుగా వ్యవహరించిన సీబీఐ మనసు మార్చుకున్నట్టుంది. సెడన్ గా అస్త్రసన్యాసం చేసింది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా గత ఎన్నికలకు ముందు.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి విచారణల పర్వం నడుస్తుందే కానీ.. కొలిక్కి రావడం లేదు. ఇటీవల వరకూ సీబీఐ చాలా దూకుడును కనబరిచింది. వరుస అరెస్టులతో బెంబేలెత్తించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆయనకు కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. అటు తరువాత సీబీఐ కేసు విచారణ మందగించింది. తుది చార్జిషీట్ తో కేసు క్లోజ్ చూపిస్తామన్న సీబీఐ గతంలో తాను చెప్పినవన్ని తప్పని చూపుతుండడం అసలు ట్విస్ట్

    సీబీఐ కోర్టులో గ‌త బుధ‌వారం ద‌ర్యాప్తు సంస్థ తుది చార్జిషీట్‌ను వేసింది. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌ను గూగుల్ టేక్ అవుట్ ప‌ట్టించింద‌ని ఇంత కాలం సీబీఐ చెబుతూ వ‌చ్చింది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేక‌రించిన సాంకేతిక స‌మాచారం ఆధారంగానే క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు సునీల్ యాద‌వ్‌, ఉద‌య్‌కుమార్‌రెడ్డి వివేకాను హ‌త్య చేసిన అనంత‌రం క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి ప‌రిస‌రాల్లోనూ ఉన్నార‌ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్న‌ట్టు సీబీఐ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విషయంలో సీబీఐ మడత పేచీ వేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

    వివేకానందరెడ్డి 2019 మార్చి 14 రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు రాత్రి  వివేకా ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడు. అర్ధరాత్రి 2.35 నిమిషాలకు ఇంటి పరిసరాల్లో, 2.45 గంటలకు ఇంటి లోపల ఉన్నట్టు గూగుల్ టేక్ ద్వారా గుర్తించామని ఇప్పటివరకూ సీబీఐ చెప్పుకొచ్చింది. తాజా చార్జిషీట్ లో మాత్రం ఆ రోజు రాత్రి వివేకా ఇంట్లో సునీల్ యాదవ్ లేడు. మార్చి 15 ఉదయం మాత్రమే వచ్చాడని సీబీఐ చెబుతోంది. దీనికి కాలమానం కొలవడంలో తప్పుగా చూపుతోంది. భారత్ కాలమానం ప్రకారం కొంత సమయం కలిపి చూపాలని చెబుతోంది. గతంలో సమాచార సేకరణలో పొరపాటు పడ్డమని సీబీఐ చెబుతుండడం గమనార్హం.

    ఇప్పటివరకూ వివేకా హత్య కేసులో రాజకీయ కోణంపైనే సీబీఐ ఎక్కువగా ఫోకస్ పెంచింది. కడప రాజకీయాల కోసమే వివేకా హత్యగావించబడ్డారని బల్లగుద్ది చెబుతూ వస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి హత్య చేయించారని కారణాలు చూపించింది. అటు వివేకా కూతురు సునీత, జగన్ సోదరి షర్మిళ సైతం బాహటంగానే ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కూడా సీబీఐ అడ్డగోలుగా మారింది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని స్పష్టం చేసింది. మరికొంతమంది నిందితులపై అనుమానం తప్ప ఆధారాలు లేవని తేల్చేసింది.
    అసలు ఎంపీ సీటు వివేకా హత్యకు కారణం కాదని చెబుతోంది. చిన్నాన్న కడప ఎంపీ సీటును ఆశించలేదని షర్మిల వాంగ్మూలాన్ని సైతం ప్రస్తావించింది. తనకు సైతం కడప రాజకీయాలపై ఆసక్తి లేదని వివేకాకు షర్మిళ చెప్పారని కూడా చార్జిషీటులో చెప్పుకొచ్చింది. మొత్తానికైతే గతానికి భిన్నంగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు విచారణ నుంచి సీబీఐ ఔట్ అయినట్టు కనిపిస్తోంది.