Indian Football : భారత్ ఫుట్ బాల్ కు మంచి రోజులు

భారత జట్టు ఐదేళ్ల తరువాత తొలిసారి 99వ స్థానాన్ని దక్కించుకుంది. 2018లో 100వ స్థానాన్ని భారత జట్టు దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని భారత జట్టు మెరుగుపరుచుకుంది. ఇకపోతే భారత పురుషుల పుట్ బాల్ జట్టు కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంకు 94 కావడం గమనార్హం. ఇకపోతే ఫిఫా ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా తొలి స్థానంలో కొనసాగుతుండగా, ప్రాన్స్ రెండో స్థానంలో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

Written By: BS, Updated On : July 21, 2023 2:27 pm
Follow us on

Indian Football : భారత ఫుట్ బాల్ జట్టు  గత కొన్నాళ్లుగా నిలకడగా ప్రదర్శన చేస్తోంది. అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతోంది. ఈ ఆట తీరే సుమారు ఐదేళ్ల విరామం తరువాత భారత పురుషుల పుట్ బాల్ జట్టు.. ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్ లో టాప్ 100 లో చోటు దక్కించుకునేలా చేసింది. కొన్నాళ్ల కిందట ప్రకటించిన ర్యాంకులో 100వ స్థానంలో నిలిచిన భారత్ జట్టు.. ఈసారి ఒక స్థానం మెరుగుపరుచుకొని 100 వ స్థానంలోకి చేరింది.

భారత పురుషుల ఫుట్ బాల్ జట్టు గత కొద్ది రోజుల నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్ షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతోపాటు అనేక మ్యాచ్ ల్లో విజయాలను సాధిస్తోంది. గతంతో పోలిస్తే ఆటగాళ్ల ఆట తీరు మెరుగుపడింది. దీంతో వరుస విజయాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టు 2018 తర్వాత అత్యుత్తమ స్థాయిలో ఫిఫా ర్యాంకింగ్ ను సాధించింది. ఇప్పటి వరకు 100, ఆపై స్థానాల్లో మాత్రమే ఉంటున్న భారత జట్టు ఐదేళ్ల తరువాత తొలిసారి 99వ స్థానాన్ని దక్కించుకుంది. 2018లో 100వ స్థానాన్ని భారత జట్టు దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని భారత జట్టు మెరుగుపరుచుకుంది. ఇకపోతే భారత పురుషుల పుట్ బాల్ జట్టు కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంకు 94 కావడం గమనార్హం. ఇకపోతే ఫిఫా ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా తొలి స్థానంలో కొనసాగుతుండగా, ప్రాన్స్ రెండో స్థానంలో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఆసియా ఖండం నుంచి 20 వ స్థానంలో కొనసాగుతూ టాప్ లో ఉంది.