Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు పై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోద అయ్యాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంబటితో పాటు పలువురు వైసీపీ నాయకులపైనా కేసులు నమోదైనట్లు సమచారం. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయనపై సత్తెపల్లి రూరల్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే.