Buffello : పశువల కోసం ఇరు కుటుంబాలు ఘర్షణ పడడం, కొట్టుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతాయి. ఇక కోడి పంచాయతీ అయితే చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఓ దున్న రెండు ఊళ్లనుషేక్ చేసింది. కుడేరు మండలం కందరగుంట, ముద్దులాపురం గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఊరి జాతర సందర్భంగా బలి ఇవ్వాల్సిన దున్నపోతు తమదంటే.. తమదని గొడవ పడ్డారు. చివరకు ఇరు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు 21, 22 తేదీల్లో జరగాల్సిన జాతరను దృష్టిలో ఉంచుకుని మిగిలిన ఇంకో దున్నపోతును మండల పరిధిలోని పోలీస్ స్టేసన్‌లో కట్టేశారు. రెండు ఊళ్ల మధ్య జాతర సామరస్యంగా జరగడంతో పోలీసులు రెండు ఊళ్ల పెద్దలను పిలిపించి దున్న పోతును విడుదల చేశారు.
ఏం జరిగిందంటే..
ముద్దులాపురంలో ముత్యాలమ్మ గ్రామ దేవత జాతర కోసం మూడేళ్ల క్రితం(3years back ) ఊరి దున్నపోతును వదిలారు. ఇదే సమయంలో కడరకుంట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉండడంతో దేవర చేయడానికి ఆ ఊరి గ్రామస్తులంతా నిర్వహణకు కదిలారు. అలా రెండు గ్రామాలు రెండు వేర్వేరు దున్న పోతులను వదిలాయి. ఇవి కొన్నాళ్లుగా గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈనెల 22న దేవర కార్యక్రమం ఉండడంతో ఇటీవల కడరకుంట గ్రామస్తులు ఓ దున్నపోతును కట్టేశారు. అయితే ఆ దున్నపతు తమ గ్రామానికి చెందినదని ముద్దులాపురం గ్రామస్తులు అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చూపించారు. కానీ కడరకుంట గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా కూడా చేశారు. తమ దేవత కోసం వదిలిన దున్నపోతును తమకు అప్పగించాలని ముద్దులాపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇటీవల వచ్చిన గొర్రె పురాణం సినిమాను తలపించింది.
ఠాణాకు దున్నపోతు..
ఇరు గ్రామాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు దున్నపోతును ఠాణాకు తరలించారు. రెండు గ్రామాల మధ్య ఘర్షణ పెరగడంతో ఈ నెలలో జరగాల్సి రెండు జాతరలు అయిపోయే వరకు దున్నపోతు పోలీస్ స్టేషన్(police station ) లో ఉంటుందని ఇరు గ్రామాల పెద్దలకు చెప్పారు. ఇప్పుడు దున్నపోతు ఠాణాలోనే ఉంది. దీంతో జాతరలు ఎలా జరుగుతాయో అన్న చర్చ జరుగుతోంది.