Godavari Pushkaralu 2027 : మహా కుంభమేళా( Mahakumbh Mela ) జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బిగ్ అప్డేట్ వచ్చింది. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. భక్తులు పరమ పవిత్రంగా భావించి పుష్కర స్నానాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. పుష్కరాలకు ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరివాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులను ప్రకటించింది. ఇందుకు సంబంధించి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.
* ఎన్నెన్నో ప్రత్యేకతలు
ఈసారి గోదావరి పుష్కరాల( Godavari festivals ) నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. 2017లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేల అపశృతి జరిగింది. ఆ ఘటన విషాదాన్ని మిగిల్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈసారి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. మరోవైపు కేంద్రం సైతం స్పందించింది. పుష్కరాల కోసం ముందస్తుగానే 100 కోట్లను ప్రకటించింది.
* ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
ప్రధానంగా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు( special trains) నడవనున్నాయి. ఈ నేపథ్యంలో నది పరివాహక రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సైతం కేంద్రం నిధులు కేటాయించింది. అందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 271 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రి కి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగా ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమయింది. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా… ఎక్కడైనా చేయవచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం 17 ఘాట్లు ఉన్నాయి. రోజుకు సగటున 75 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం( state government) ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. గతంలో పుష్కరాలు జరిగిన సమయంలో టిడిపి అధికారంలో ఉంది. కానీ అప్పట్లో అపశృతి జరిగింది. మరోసారి ఆ పరిస్థితులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏకంగా పుష్కర ఘాట్ల అభివృద్ధికి 904 కోట్ల తో బడ్జెట్ ప్రతిపాదించారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి 456 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి 678 కోట్లు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ ల కోసం కావాల్సిన నిధుల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు గోదావరి పుష్కరాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.