Tabu : సుమారుగా రెండున్నర దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్ గా కోట్లాది మంది మూవీ లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లో ఒకరు టబు. ఈమె 1991 వ సంవత్సరం లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘కూలీ నెంబర్ 1’ చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ రెండేళ్ల పాటు విరామం తీసుకొని బాలీవుడ్ లో తన కెరీర్ ని కొనసాగించింది. తెలుగులో కంటే అక్కడే ఎక్కువగా అవకాశాలను సంపాదిస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లో ఈమె ఎక్కువగా అక్కినేని నాగార్జున తోనే సినిమాలు చేసింది. ‘సిసింద్రీ’, ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాలు నాగార్జున తో చేసింది.
ఈ మూడు సినిమాలు కూడా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి, కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది, నాగార్జున కి సీక్రెట్ లవర్ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే టబు వయస్సు ప్రస్తుతం 50 ఏళ్ళు దాటింది. కానీ ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు టబు సమాధానం చెప్తూ ‘పెళ్లంటే నాకు ఆసక్తి లేదు..మగవాడు కేవలం నాకు బెడ్ మీద పాడుకోవడానికే పనికొస్తాడు. అంత వరకు మాత్రమే నాకు ఇష్టం’ అంటూ ఆమె కామెంట్స్ చేసినట్టు బాలీవుడ్ లోని ఒక ప్రముఖ వెబ్ సైట్ ప్రచురించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇది టబు దృష్టికి చేరడంతో వెంటనే ఆమె తన టీం ద్వారా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘రీసెంట్ గా నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సోషల్ మీడియాలో నేను పెళ్లి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం అవుతుంది. అందులో ఎలాంటి నిజం లేదు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. టీం స్పందిస్తూ ‘పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వ్యూస్ కోసం టబు పేరు ని వాడుకొని అసభ్యకరమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఇది కచ్చితంగా నేరమే. తక్షణమే సదరు వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెల్స్ ప్రచురించిన ఈ తప్పుడు ప్రచారాలను తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేనిచొ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ హెచ్చరించారు. ఇకపోతే టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి ‘భూత్ బంగ్లా’ అనే చిత్రం లో నటిస్తుంది. ‘హేరా పేరి’ చిత్రం తర్వాత 25 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రమిది.