BR Naidu Controversy Viral Video: తెలుగుదేశం( Telugu Desam) కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశం కుదిపేస్తోంది. నాయకుల వ్యక్తిగత వ్యవహార శైలి ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చిపెడుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఒకవైపు నడుస్తుండగా.. తాజాగా టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత బి ఆర్ నాయుడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఆయన ఉండటానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది కల్పిత వీడియో అని.. ఏఐ ఆధారితంగా రూపొందించినది అంటూ బిఆర్ నాయుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కథలు కాపీనేనా..?
* చంద్రబాబు పదేపదే హెచ్చరిక..
నేతల వ్యక్తిగత వ్యవహార శైలి విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు( CM Chandrababu) పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే నేతల తీరు మారడం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. అప్పుడే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అటాక్ ప్రారంభించింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. బిఆర్ నాయుడు వ్యక్తిగత వ్యవహారంపై తమకు అభ్యంతరాలు లేవని.. టీటీడీ చైర్మన్ హోదాలో ఒక పరాయి మహిళతో అభ్యంతరకరంగా ఉండడం దారుణం అన్నారు. తక్షణం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బి ఆర్ నాయుడు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వీడియోలో తప్పు ఏం ఉందని ప్రశ్నించారు. అదంతా మార్ఫింగ్ చేసిన వీడియో గా చెప్పుకొచ్చారు.
* రెండు రకాలుగా ప్రత్యర్థులు..
ఒకవైపు ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో కూటమి నేతలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. జనసేనలో ఇంకా అరవ శ్రీధర్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంతలోనే ఇప్పుడు బిఆర్ నాయుడు సైతం వివాదాస్పదం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన కేవలం టీటీడీ చైర్మన్ మాత్రమే కాదు. టీవీ5 ఛానల్ అధినేత కూడా. ఆయనకు రాజకీయంగాను, మీడియా పరంగాను ప్రత్యర్థులు ఎక్కువ. లేక లేక చంద్రబాబు ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చూస్తుంటే ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.