spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: నావల్ల కాదు.. తప్పుకుంటా అంటున్న బొత్స!

Botsa Satyanarayana: నావల్ల కాదు.. తప్పుకుంటా అంటున్న బొత్స!

Botsa Satyanarayana: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. అధికారపక్షంగా కూటమి ఉంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. మరోవైపు 11 స్థానాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ అధికారిక ప్రతిపక్ష హోదా మాత్రం ఆ పార్టీకి లేదు. అది ఇవ్వనిదే తాను అసెంబ్లీకి హాజరు కాను అని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే ఒకరకంగా శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒత్తిడి ఉంది. చైర్మన్గా సొంత పార్టీ నేత ఉన్నారు. అయినా సరే అధికార పార్టీని తట్టుకోలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మంత్రులు కూడా గట్టిగానే జవాబు ఇస్తుండగా.. కూటమి తరుపున తక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నా కమిట్మెంట్తో ఎక్కువమంది పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో వైసీపీ తరఫున వాయిస్ వినిపించడం తన వల్ల కాదు అంటూ బొత్స సత్యనారాయణ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ఆ వైసిపి మాజీ ఎంపీ కి ఘోర అవమానం!

* లోతైన చర్చ..
సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స(Botsa Satyanarayana ). అయితే ఆయనకు అనారోగ్యమైన సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన చుట్టూ తిరుగుతున్న వార్తలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సొంత పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినిపిస్తున్న రాజీనామా వార్తలు ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి.

* తరచూ అనారోగ్యం..
శాసనమండలి సమావేశాలు ఇటీవల ముగిసాయి. అయితే ఈ సమావేశాలు జరుగుతుండగా బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం అందరిని ఆందోళనలో ముంచెత్తింది. సభలో కాగ్ రిపోర్ట్ పై చర్చిస్తున్న సమయంలో ఆయన బిపి అకాస్మాత్తుగా పెరిగింది. కిందకు తూలి పడబోయారు. పక్కనే ఉన్న తోటి సభ్యులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆయనకు అధిక రక్తపోటు ఉన్నట్లు తేలింది. అంతకుముందు అదే అనారోగ్య సమస్యతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. సభకు వచ్చి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో బొత్స తన స్నేహితుల వద్ద.. రాజకీయాల్లో మునుపటిలా చురుగ్గా ఉండడం నావల్ల కావడం లేదు అన్నట్టు ప్రచారం నడుస్తోంది.

బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మాత్రమే కాదు.. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు.. ఆపై పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు కూడా. ఒకవైపు శాసనమండలిలో ప్రతిపక్షపాత్ర.. ఇంకోవైపు విశాఖ బాధ్యతలు చూసుకోవడం అంటే చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి శాసనసభను బహిష్కరించి ఆయన తరహా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆయన కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాజకీయం చేయలేను అంటూ బొత్స తగ్గుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే బొత్స ఫ్యామిలీ యాక్టివ్ రాజకీయాల్లో ఉంది. కానీ ఆయన తప్పుకుంటే ఆ ఫ్యామిలీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడటం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper