Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స అసంతృప్తితో ఉన్నారా? విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పెత్తనాన్ని సహించలేకపోతున్నారా? అందుకే జగన్ పర్యటనకు ముఖం చాటేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా సోకిన సంగతి తెలిసిందే. బాధితుల పరామర్శకు జగన్ విజయనగరం వచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు కనిపించినా.. బొత్స సత్యనారాయణ కనిపించకపోవడం విశేషం. అయితే బొత్స అసంతృప్తితో ఉన్నారని..అందుకే కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో ఒక రకమైన వాదన ప్రారంభం అయింది. కనీసం విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా బొత్స దర్శనం ఇవ్వలేదు. వాస్తవానికి గుర్ల..బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనిదే. పైగా బొత్స ఉత్తరాంధ్ర కీలక నేత.అయినా సరే ఆయన జగన్ వెంట కనిపించకపోయేసరికి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆయన ముఖం చాటేశారని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందుకు విజయసాయిరెడ్డి కారణమని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి నియామకంపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అయినా సరే జగన్ పెడచెవిన పెట్టినట్లు సమాచారం.
* ప్రాధాన్యమిచ్చిన జగన్
సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో సైతం కంటిన్యూ చేశారు. మొన్నటి ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యులందరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మికి విశాఖ పార్లమెంటు సీటును కట్టబెట్టారు. అయితే అందరూ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు జగన్. అక్కడ బొత్స అయితేనే తట్టుకోగలరని భావించి ఆయనను రంగంలోకి దించారు.జగన్ నమ్మినట్టే అక్కడ బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్యాబినెట్ హోదా తో సమానమైన శాసనమండలి విపక్ష నేత పదవి కూడా ఇచ్చారు జగన్. దీంతో పార్టీలో బొత్స యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు. కానీ జగన్ విజయనగరం పర్యటనలో మాత్రం కనిపించలేదు.
* సమన్వయకర్తల నియామకం
రాష్ట్రవ్యాప్తంగా ఆరు రీజియన్లుగా విభజించి వైసిపి సమన్వయకర్తలను నియమించారు జగన్. ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డికి ఇచ్చారు.బొత్స సత్యనారాయణ ను ఉభయ గోదావరి జిల్లాలకు నియమించారు. కానీ బొత్స మాత్రం ఉత్తరాంధ్ర బాధ్యతలను ఆశించారు. కానీ అనూహ్యంగా విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. తనను చెప్పేందుకే విజయసాయిరెడ్డి నియామకమని బొత్స అనుమానించారు. అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ వినలేదు. అందుకే బొత్స కినుక వహించినట్లు సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Botsa satyanarayana misses during jagans visit the reason is vijayasai
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com