Deputy Cm Pawan Kalyan : పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సంచలనాలకు వేదికగా మారుతున్నారు. ప్రభుత్వంతో పాటు వ్యవస్థల్లో ఉన్న లోపాలను సైతం ప్రస్తావిస్తున్నారు. అందులో కదలికలు తీసుకొస్తున్నారు. ఏకంగా హోం శాఖ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపారు. వెంటనే పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. వైసిపి సోషల్ మీడియా పని పట్టింది. ఇప్పుడు తాజాగా ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు బీఎండబ్ల్యూ కార్లపై వివాదం నెలకొంది. వాటిలో ఒక కారును అటవీ శాఖ అధికారికి కేటాయించారు. రెండో కారు ఒక ఐఏఎస్ సతీమణి వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనిపై పవన్ ఆరా తీసేసరికి మరింత ఆసక్తికరంగా మారింది. అధికారుల్లో టెన్షన్ ప్రారంభం అయ్యింది. 2017లో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మాయమయ్యేసరికి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ తాజాగా స్పందించారు.
* ఆ వాహనాలు ఏవి
ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లకు సంబంధించి రెండు కార్లను 2017లో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండింటిలో ఒకదాన్ని అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనంతరం కు కేటాయించారు. అటు తరువాత నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ కారు ఏమైందో? ఎక్కడ ఉందో తెలియదంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ వాహనం వివరాలు ఇవ్వాలని తాజాగా పిసిసిఎఫ్ నుంచి అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి లేఖ అందింది. దీనిపై అధికారిక వర్గాల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మరో కారును హైదరాబాదులో ఐఏఎస్ సతీమణి వాడుతున్నట్లు తెలుస్తోంది.
* ప్రైవేటు పీఏ కు కేటాయింపు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో 2015లో ఓ కేసు నమోదు అయింది. ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బిహెచ్ 3303 నెంబర్ బీఎండబ్ల్యూ కారును అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్వాధీనం కాకముందే ఆ వాహనాన్ని డిసెంబర్ 11, 2017లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు. అప్పట్లో అనంత రాము ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన స్థానంలో అటు తరువాత నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్, జి ఎస్ ఆర్ కె ఆర్ విజయ్ కుమార్ వచ్చారు. కానీ అటు తరువాత ఆ బీఎండబ్ల్యూ కారు ఎక్కడ ఉందనేది ఇంతవరకు తెలియదు.
* మరో టయోటా కారు కూడా
పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి టీఎన్ 18 కే 2277 bmw కారును 2017 ఫిబ్రవరిలో స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అదనపు ప్రైవేటు కార్యదర్శి ఆ వాహనాన్ని కేటాయించారు. ఆ కారు గురించి ప్రస్తుత అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు. వీటితోపాటు టయోటా కారు గురించి కూడా స్థానిక అధికారుల వద్ద సమాచారం లేదు. అసలు ఈ కార్లు ఏమయ్యాయి అనేది అంతుచిక్కడం లేదు. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఉండడంతో ఈ వాహనాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం