BJP green signal to Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించే వార్త చక్కెర్లు కొడుతోంది. రాజకీయ సమీకరణలను మార్చే కీలక నేతల భేటీ ఒకటి జరుగుతందన్న ప్రచారం ఊపందుకుంది. రేపు ఢిల్లీ వేదికగా జీ20 సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అన్ని రాష్ట్రాలకు చెందిన సీఎంలకు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. రాత్రికి ఇరువురి నేతల మధ్య కీలక భేటీ జరుగుతున్నవార్త ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
జీ20 శిఖరాగ్ర సమావేశ నిర్వహణ ఈసారి ఇండియాకు దక్కిన సంగతి తెలిసిందే.సన్నాహాక సమావేశాల్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులకు భాగస్థులను చేశారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం దేశ రాజధానిలో జరిగే సమావేశానికి చంద్రబాబుహాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ కీలక భేటీకి రాజకీయ ప్రాధాన్యముంది. ఏపీతో పాటు జాతీయ స్థాయి రాజకీయాలు ఇద్దరి నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో అమిత్ షా భేటీ ఈ ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2018 మార్చి నెలలో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. అలా తెగదెంపులు చేసుకున్న తరువాత 2019 ఎన్నికలో టీడీపీ ఓడింది. నాటి నుంచి బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు తన నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.కానీ బీజేపీ నుంచి నిన్నటి దాకా సానుకూలత అయితే రాలేదు. కానీ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత సీన్ మొత్తం మారిందన్నటాక్ వినిపిస్తోంది.
జాతీయ స్థాయిలో విపక్ష కూటమికి ఒక తుదిరూపం వస్తోంది. మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమి కడుతున్న క్రమంలో దక్షిణాదిలో గట్టి నాయకుడుగా ఉన్న చంద్రబాబును తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ మెత్తబడినట్టు సమాచారం. చంద్రబాబు జాతీయ స్థాయిలో సమర్థుడైన నేత. విపక్షాలను ఏకతాటిపైకి తేవడం ఆయనకు సాధ్యం. ఈ విషయంలో చాలా సందర్భాల్లో కన్ఫర్మ్ అయ్యింది. అందుకే ఆయన విపక్ష కూటమి వైపు చూడకుండా బీజేపీ నేతలు కళ్లెం వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు తమవాడేనని సంకేతాలివ్వనున్నారున్న మాట.
గతంలో ఇదే అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో గడిపారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు దాడి జరిగిన నేపధ్యంలో ఢిల్లీ వెళ్ళి నాలుగైదు రోజుల పాటు చంద్రబాబు మకాం వేశారు. కేంద్ర హోం మంత్రిని కలసి వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ అమిత్ షా అవకాశం ఇవ్వలేదు. అటువంటి ఏ హడావుడి లేకుండా అమిత్ షా చంద్రబాబుకు తాజాగా అపాయింట్ మెంట్ ఇచ్చి సమావేశమవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఒక్క అమిత్ షాతోనే కాదు ప్రధాని మోదీతో సైతం చంద్రబాబు భేటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మాత్రం ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.