Telugu Desam Party : తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ డిఫెన్స్ లో పడిందా? ఆ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందా? బిజెపి ఎదిగి పోనుందని అంచనాకు వచ్చిందా? మున్ముందు ఆ పార్టీతో ఇబ్బంది అని అనిపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట.. క్రమేపీ జాతీయ పార్టీలు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ పార్టీలు దూకుడుగా ఉన్నన్నాళ్లు జాతీయ పార్టీలకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కొనసాగుతోంది. పేరుకే తాము జాతీయ పార్టీలు అని.. ప్రాంతీయ పార్టీల కింద పనిచేయాల్సి వస్తోందన్న ఆవేదన జాతీయ పార్టీల్లో ఉంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అవతరించిన తర్వాత.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే ఇలా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్లంతా.. ఒకప్పుడు జాతీయ పార్టీ నేతలే.
* యూపీలో కొన్నాళ్లు అలా
ఉత్తరప్రదేశ్‌లో ( ఉత్తరప్రదేశ్) జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను మట్టి కరిపించింది సమాజ్వాది, బహుజన్ సమాజ్వాది పార్టీలు. ఆ రెండు పార్టీలు జోరు మీద ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గింది. అయితే ఎప్పుడైతే బహుజన్ సమాజ్వాది పార్టీ వీక్ అయ్యిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. భారతీయ జనతా పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అధికారంలోకి రాగలిగింది. అంటే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి ముందుకు వచ్చాయన్నమాట. అయితే ప్రాంతీయ పార్టీల హవా నడిచినంత కాలం జాతీయ పార్టీలు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది.
* తమిళనాడులో నో ఛాన్స్ తమిళనాడులో( తమిళనాడు ) దశాబ్దాలుగా జాతీయ పార్టీలు అడుగుపెట్టాలని ప్రయత్నం లేదు. కానీ వారి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకె గొడుగు కింద.. బిజెపి అన్న డీఎంకే గొడుగు కింద పని చేయాల్సి ఉంది. అయితే ఇదే మాదిరిగా మహారాష్ట్రలోను వ్యవహరించేది. ఎన్సీపీ వర్సెస్ శివసేన అన్నట్టు అక్కడ పరిస్థితి నడిచేది. కానీ ఆ రెండు పార్టీల్లో అసమ్మతి నాయకత్వాన్ని ప్రోత్సహించింది. ఆ రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకొని గేమ్ ఆడింది. మహారాష్ట్రలో అధికారాన్ని హస్త గతం చేసుకోగలిగింది. దశాబ్దాలుగా వారికి స్నేహ హస్తం అందించిన ఠాక్రే కుటుంబానికి కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధపడిందంటే.. బిజెపి భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకుంది.
* వైసిపి ప్లేస్ లోకి బిజెపి వస్తే
ఏపీలో( ఆంధ్ర ప్రదేశ్) బలమైన ప్రాంతీయ పార్టీలుగా టిడిపి, వైసిపి ఉండేవి. ఆ తర్వాత మధ్య హోరాహోరీ ఫైట్ నడిచేది. ఇప్పుడు మధ్యలో జనసేన వచ్చింది. మరోవైపు బిజెపి సైతం ఎంటర్ అయింది. మూడు పార్టీల కూటమి వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు బీజేపీ వైసీపీని కబళించే ప్రయత్నం చేస్తోంది. వైసిపి ప్లేస్ లోకి జనసేన ను పంపించడం.. జనసేన ప్లేసులో బిజెపి రావాలన్న ఆలోచనలో అగ్రనేతలు చూపిస్తున్న సమాచారం. అంటే వచ్చే ఎన్నికల నాటికి వైసిపిని నిర్వీర్యం చేయాలన్నది బిజెపి ప్లాన్. అయితే ఇప్పుడే భయపడుతోంది తెలుగుదేశం. వైసీపీతో అయితే నేరుగా తలపడవచ్చు. కానీ బిజెపి విషయంలో అలా కుదరదు. ఎందుకంటే బిజెపి అధికారం కోసం ఎంతటి వరకైనా ముందుకెళ్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే వైసిపి ఉండాలి కానీ.. కంట్రోల్ లో ఉండాలి.. ఆపై విజయానికి దూరంగా ఉండాలి. అయితే ఆ ప్లేస్ లోకి బిజెపి వస్తే వారికి ఇబ్బందులు తప్పవని తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా విధాలుగా భయపడుతోంది. అందుకే వైసిపి నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో కూడా కాస్త మార్పు వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో?