Homeఆంధ్రప్రదేశ్‌BJP Entry Strategy AP Politics: లోకేష్ పై ప్రధాని పొగడ్తలు.. టీడీపీలో భయం

BJP Entry Strategy AP Politics: లోకేష్ పై ప్రధాని పొగడ్తలు.. టీడీపీలో భయం

BJP Entry Strategy AP Politics: ఏపీలో( Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ కంటే సీనియర్ భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎంట్రీ సమయంలోనే విశాఖ నగరపాలక సంస్థను బిజెపి గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే బిజెపి అవసరమని గుర్తించారు నందమూరి తారక రామారావు. అప్పటినుంచి ఇప్పటివరకు బిజెపితో అప్పుడప్పుడు తప్ప మైత్రి కొనసాగుతూనే ఉంది. అయితే ఏపీలో టిడిపి బలమైన శక్తిగా ఎదిగింది. కానీ బిజెపి పరిస్థితి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. దీనికి కారణం చంద్రబాబు చతురత. చంద్రబాబు ఉన్నంతవరకు బిజెపి ఎంట్రీ అంత ఆషామాషీ కాదు. అదే బిజెపి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తే టిడిపి మనుగడ కష్టం. అందుకే చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత ఆయన ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బిజెపిని నిలువరించారు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఏపీలో మాత్రం బిజెపి బలపడేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. అది కూడా లోకేష్ ద్వారా వర్కౌట్ చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.

Also Read: Modi Support To Lokesh: పవన్ కు షాక్.. లోకేష్ కు ప్రయారిటీ.. మోడీ ప్లాన్ అదే!

తరచూ ప్రశంసలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) నారా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశాల్లో లోకేష్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ఢిల్లీకి ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న యోగాంధ్రా వేడుకల్లో లోకేష్ ను ఆశీర్వదించారు. అయితే గతంలో చాలా రాజకీయ పార్టీలు, నేతల విషయంలో ప్రధాని మోదీ ఇలానే వ్యవహరించారు. చాలా చనువు తీసుకున్నారు. అటు తరువాత వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. బిజెపి నుంచి వారికి రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలో శివసేన ఠాక్రి ఫ్యామిలీకి, ఉత్తరప్రదేశ్లో బీఎస్సీ మాయావతి, కర్ణాటకలో జేడిఎస్ దేవే గౌడ, తమిళనాడులో అన్న డిఎంకె, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, బీహార్లో నితీష్ కుమార్ వంటి వారిని ఇలానే దగ్గర తీసుకొని దెబ్బేశారు. ఇప్పుడు కూడా లోకేష్ విషయంలో అటువంటి పరిస్థితి ఉంటుందన్న టాక్ ప్రారంభం అయింది.

Also Read: Nara Lokesh: ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!

చంద్రబాబు ఉన్నంతవరకు..
చంద్రబాబు( CM Chandrababu) ఉన్నంతవరకు నో డౌట్. ఆయన విషయంలో బిజెపి క్రాష్ చేసే అవకాశం లేదు. ఆ చాన్స్ కూడా ఆయన ఇవ్వరు. ఎందుకంటే చంద్రబాబు గురించి బిజెపికి తెలుసు. అందుకే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా లోకేష్ తో సఖ్యతగా ఉన్నారు బిజెపి పెద్దలు. ఒకవేళ భవిష్యత్తులో బిజెపి గ్రాఫ్ తగ్గినా లోకేష్ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ గ్రాఫ్ పెరిగినా ఏపీలో అదే లోకేష్ ద్వారా.. అధికార పంపకాలు చేయాలని చూస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ ని సీఎంగా చేయడానికి బిజెపి నుంచి అభ్యంతరం రాదు. కానీ అటు తరువాత మాత్రం పెద్ద ఎత్తున ఆ పార్టీ పావులు కదుపుతుంది. మహారాష్ట్ర ఎపిసోడ్లో అదే జరిగింది. త్వరలో లోకేష్ కు టిడిపి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. టిడిపి మొత్తం లోకేష్ కంట్రోల్లోకి వెళ్తుంది. అందుకే కమలనాధులు ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version