Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu - ACB Court : చంద్రబాబు నివాసమా? లింగమనేని గెస్ట్ హౌసా?

Chandrababu – ACB Court : చంద్రబాబు నివాసమా? లింగమనేని గెస్ట్ హౌసా?

Chandrababu – ACB Court : చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. తాను నివాసముంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చింది. అప్పట్లో చంద్రబాబు ఇల్లు జప్తు అని రాసుకొచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం ఇప్పుడు మడత పేచీ వేశాయి. లింగమనేని గెస్ట్ హౌస్ హౌస్ జప్తు అంటూ రాసుకొచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణా నది కరకట్టలపై నిబంధనకు విరుద్ధమైన నిర్మాణమంటూ ఆరోపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్విడ్ ప్రోకు పాల్పడి లింగమనేని నుంచి ఈ నివాసాన్ని పొందారన్నది అభియోగం. అయితే తాను కేవలం అద్దెకు మాత్రమే ఉంటున్నట్టు చంద్రబాబు చెబుతున్నారు.

అయితే ఇది లింగమనేని గెస్ట్ హౌసా.. లేకుంటే చంద్రబాబు నివాసమా అన్నది తెలాల్సి ఉంది. ఒక వేళ చంద్రబాబు అద్దెకు తీసుకుంటే అందుకు సంబంధించిన లావాదేవీలు కనిపించడం లేదని.. కనీసం అద్దె చెల్లించినట్టు చంద్రబాబు.. అద్దె తీసుకున్నట్టు లింగమనేని ఎందుకు ప్రకటించలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక వేళ లింగమనేని అద్దె రూపంలో తీసుకొని ఉంటే జీఎస్టీ చెల్లింపులు ఎందుకు చేయలేదని కొత్త పాయింట్ ను తెరపైకి తెచ్చాయి. దీంతో ఈ వివాదం మరింత ముదరిపాకాన పడుతోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో లింగమనేనికి ఎన్నో లాభాలు చేకూర్చే పనిచేశారన్నది చంద్రబాబుపై అభియోగం. చంద్రబాబుకు లింగమనేని బినామీ అని కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. క్విడ్ ప్రోలో భాగంగానే గెస్ట్ హౌస్ తీసుకున్నారని.. అది చంద్రబాబు సొంతమని వైసీపీ వాదిస్తోంది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలని తొలుత సీఐడీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో అప్పట్లో సీఐడీ జడ్జికి సమాచారమిస్తూ ప్రభుత్వం ఆ ఇంటిని జప్తు చేసింది. ఇప్పుడు ఏకంగా కోర్టే జప్తు చేయాలని ఆదేశాలిచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular