https://oktelugu.com/

India-China : ఇండియా , చైనా వివాదానికి తెర.. సంధి చేసిన రష్యా అధ్యక్షుడు.. పాకిస్తాన్‌కు షాక్‌ లగా..!

రష్యాలోని కజాన్‌లో నిర్వహించిన బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత్‌ – చైనా మధ్య సంధి కుదిరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఇరు దేశాధినేతల చర్చలకు మార్గం సుగమం చేశారు. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 / 10:39 AM IST

    India-China

    Follow us on

    India-China : రష్యాలోకి కజాన్‌ వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన బ్రిక్స్‌ దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్‌ 22 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మూడు నెలల క్రితమే రష్యా వెళ్లిన ప్రధాని మోదీ.. అప్పుడు రష్యా–ఉక్రెయిన్‌ మధ్య సయోధ్యకు, శాంతికి మార్గం వేశారు. తాజా పర్యటనలో పుతిన్‌.. భారత్‌–చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేలా.. ఇరు దేశాల మధ్య సంధి కుదిరేలా బ్రిక్స్‌ సదస్సును వేదికగా మార్చారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరయ్యారు. దీంతో భారత్‌–చైనా చర్చలకు చొరవ చూపారు. దీంతో మోదీ–జిన్‌పింగ్‌ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, చైనా సంబంధాల మెరుగుల దిశగా కీలక పరిణామానికి పుతిన్‌ ప్రత్యేక చొరవ చూపారు. అక్టోబర్‌ 23న(బుధవారం) దైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్‌ భేటీ కావడం విశేషం. లద్దాఫ్‌ సమీపంలో గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధుల నడుమ మరిన్ని ఉన్నతస్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దులో శాంతి, సుస్థిరత పరిరక్షణే ఇరు దేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

    50 నిమిషాలు చర్చలు..
    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య సుమారు 50 నిమిషాలపాటు ద్వైపాక్షి చర్చలు జరిగాయి. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతి, సౌబ్రాతృత్వాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలని జిన్‌ పింగ్‌కు భారత ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద దేశాలైన చైనా–భారత్‌ మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు కీలకమని తెలిపారు.

    చర్చల సారాశం ఎక్స్‌లో..
    జిన్‌పింగ్‌–మోదీ చర్చల అనంతరం.. ప్రధాని చర్చల సారాంశాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఈ భేటీని రెండు దేశాల ప్రజలతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్య అన్నిస్థాయిలోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అవసరం. పలుప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలపైనా చర్చలు జరిగాయి’ అని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తి మద్దతు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు.

    సంసంబంధాల పునరుద్ధరణ..
    చైనా, భారత్‌ సైనికుల మధ్య 2020 నాటి గాల్వన లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాత సంబంధాలు బాగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో వాటిని చక్కదిర్దుకునే ప్రయత్నంతోపాటు సంత్సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా ఈ భేటీ జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు లోతుగా సమీక్షించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య ప్రతినిధులు స్థాయి చర్చలు పునరుద్ధరిస్తాయని భావిస్తున్నారు. సరిహద్దు వివాదం మొదలుకుని విభేదాలపై ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపేందుకు ఈ భేటి ముందడుగుగా భావించాలి. పరిస్థితులు సాధారణ స్థాయికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.

    పాక్‌కు షాక్‌..
    తాజాగా జరిగిన భారత్, చైనా అధినేతల భేటీ మన దాయాది దేశం పాకిస్తాన్‌కు షాక్‌ అనే చెప్పాలి. ఇంతకాలం పాకిస్తాన్‌కు చైనా సహకారం అందిస్తోంది. చైనాకు భారత్‌ గురించి పాక్తిసాన్‌ నూరిపోస్తోంది. కశ్మీర్‌ ఆక్రమణలకు చైనా సహకారం తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో జిన్‌పింగ్, మోదీ భేటీ కావడం సరిహద్దు అంశంపై చర్చించడం. శాంతి, సామరస్యతకు ఇరు దేశాలు అంగీకరించడం పాకిస్తాన్‌కు మింగుడు పడని అంశం. అయితే చైనా ఒప్పందాలనే అతిక్రమించే దేశం. ఈ క్రమంలో తాజా చర్చలకు ఆ దేశం కట్టుబడి ఉంటుందా.. భారత్‌తో సత్సంబంధాలు పునరుద్ధరిస్తుందా అనేది చూడాలి.