Bay of Bengal Weather Update: బంగాళాఖాతంలో( Bay of Bengal ) మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో.. వరుసగా ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకొని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.
Also Read: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాలకు హెచ్చరిక
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు( North Andhra) భారీ వర్ష సూచన ఉంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతం, ఆత్మకూరు, నెల్లూరు, కావలిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు సైతం ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Also Read: బంగాళాఖాతం నుంచి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత!
జూలైలో రికార్డు స్థాయిలో వర్షాలు?
సాధారణంగా నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి ఉపయోగపడతాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతోనే ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కలుగుతుంది. ఈ ఏడాది ముందుగానే దేశానికి నైరుతి రుతుపవనాలు తాకాయి. భారీగా వర్షాలు నమోదు వస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక బాగుంది. జూలైలో రికార్డుకు మించి వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖరీఫ్ నకు ఇది శుభ సూచికమని సంకేతాలు వస్తున్నాయి.