Banakacharla Water Dispute: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) భారీ వ్యూహం పన్నారా? ఏకకాలంలో ఇద్దరు ప్రత్యర్థులను దెబ్బతీశారా? తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఆత్మ రక్షణలో నెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ అనుసంధానం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తెలంగాణ జల హక్కులను కాలరాసే విధంగా ఉందని రేవంత్ అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ రాయలసీమ ప్రయోజనాల కోసం అంటూ చంద్రబాబు చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతున్నారు. తెలంగాణ జల ప్రయోజనాలను విస్మరించారని కెసిఆర్ పై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
రాజకీయ స్నేహం..
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy), కెసిఆర్ ల మధ్య రాజకీయ స్నేహం కొనసాగింది. అయితే అది రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా.. రాజకీయ ప్రయోజనాలకు పరిమితం అయిందన్న విమర్శ ఉంది. ఇద్దరూ కలిసి విందులు చేశారు. వినోదాల్లో పంచుకున్నారు. కానీ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రం దెబ్బ తీశారు. ఇప్పుడు దీనినే ఉభయ రాష్ట్రాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కెసిఆర్ రాజీ పడిపోయారని విమర్శించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల జల పంపకాల్లో.. తెలంగాణను ప్రత్యేకంగా పరిగణించాలన్న చిన్న లాజిక్ ను కెసిఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నీటి వాటాను పోను.. మిగతా జలాలను తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సిన విషయం కెసిఆర్ కు తెలియదా అంటూ నిలదీశారు. తద్వారా తెలంగాణ సమాజంలో కేసీఆర్ వ్యవహార శైలిని ఎండగట్టారు. రాజకీయంగా దెబ్బతీశారు.
Also Rad: జగన్ ను లేపుతున్న కూటమి.. ఏరికోరి ప్రచారం!
రాయలసీమలో జగన్ కు దెబ్బ రాయలసీమ( Rayalaseema ) ప్రయోజనాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుమతులు నిలిపివేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్ట్ అంశం విస్తృత ప్రచారంగా మారింది. ఏపీ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టు కీలకం. ముఖ్యంగా రాయలసీమ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నది చంద్రబాబు లక్ష్యం. తద్వారా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి చేయలేని పని.. తాను చేసే ప్రయత్నం చేస్తున్నానని రాయలసీమ సమాజం గుర్తించేలా చేస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేశారు. ఇన్ని రోజులు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను వాడుకున్నారు జగన్. ఇప్పుడు అదే రాయలసీమ కోసం చంద్రబాబు సర్కార్ ఒక ప్రాజెక్టును తలపెడితే.. దానికి అభ్యంతరాలు వస్తుంటే.. కనీసం నోరు తెరవడం లేదు. ఇది పొలిటికల్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి.
హైదరాబాదులో పట్టు బిగించే వ్యూహం.. హైదరాబాదులో( Hyderabad) సీమాంధ్ర సెటిలర్స్ అధికం. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ హైదరాబాద్ జలాల కోసం గట్టిగానే పోరాటం చేస్తోంది. కేవలం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వల్లే.. హైదరాబాద్ నగరానికి కేసీఆర్ అన్యాయం చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కెసిఆర్ పార్టీ ఎక్కువగా గెలిచింది. కానీ అదే హైదరాబాద్ జల అవసరాలను కెసిఆర్ విస్మరించారని రేవంత్ చెబుతున్నారు. ఈ అంశం ప్రజల్లోకి వెళితే హైదరాబాదులో కెసిఆర్ పార్టీకి డ్యామేజ్ తప్పదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ పార్టీ బలహీనపడుతోంది. అంటే చంద్రబాబు వేసిన వ్యూహానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులు చిత్తయ్యెలా ఉన్నారు. అయితే చంద్రబాబు వ్యూహానికి వారు విరుగుడుగా ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తారో చూడాలి.
‘They don’t name the govt. They don’t name other parties. But only BRS, because everyone knows who’s actually fighting’
While speaking about the Banakacharla project, CBN garu clearly says #BRS is opposing it.
• Not the Telangana Govt
• Not the Congress Party
• Not the… pic.twitter.com/8aO4gT3L2F— Nayini Anurag Reddy (@NAR_Handle) May 29, 2025