Balineni Srinivas Reddy : జనసేనలో( janasena ) బాలినేని వ్యతిరేక గ్రూప్ యాక్టివ్ అవుతోందా? ఇద్దరు నాయకులు ఏకమయ్యారా? భవిష్యత్తులో బాలినేని చుక్కలు చూపించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం ఎనలేని ప్రాధాన్యం దక్కించుకున్నారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేనలో చేరారు. అయితే జనసేనలో బాలినేని పట్టు బిగించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ముఖ్యంగా జనసేనలో ఇప్పటికే రియాజ్, కంది చంద్రశేఖర్ లు యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు వారిని తట్టుకొని బాలినేని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : వైసిపి మాజీ మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే.. జగన్ కు కొత్త తలనొప్పి!
* వైసీపీలో ఎనలేని ప్రాధాన్యం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఒకానొక దశలో ఒంగోలు అంటే బాలినేని.. బాలినేని అంటే ఒంగోలు అన్న పరిస్థితి ఉండేది. అయితే మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించారు. అప్పటినుంచి బాలినేని స్వరంలో మార్పు వచ్చింది. ఆపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను నియంత్రించడంతో ఫుల్ సైలెంట్ అయ్యారు బాలినేని. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. జనసేనలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన బాలినేనికి వ్యతిరేకంగా ఇద్దరు నేతలు ఇప్పుడు జనసేనలో పావులు కదుపుతున్నారు. అందుకే ఒంగోలు వచ్చి తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు బాలినేని. ఇప్పుడు బాలినేని చుట్టూ ఉన్నవారు పూర్వపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే. ఒరిజినల్ జనసేన శ్రేణులు మాత్రం రియాజ్, కంది చంద్రశేఖర్ వైపు ఉన్నారు.
* ఆ స్వేచ్ఛ ఇక్కడలే..
అయితే జనసేనలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ) ఉన్నారు కానీ.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ లో చలామణి అయినట్లు ఇక్కడ కాలేకపోతున్నారు. గత అనుభవాల దృష్ట్యా కూటమి నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలుపుకుని వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి వేదికలపై కూడా బాలినేని దర్శనం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాలకు ఆయనకు పెద్దగా ఆహ్వానం లేదని తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన సైతం బాలినేనిని వ్యతిరేకిస్తున్నారు. పైగా జనసేనలో సైతం బాలినేని వ్యతిరేకవర్గం యాక్టివ్ గా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జనసేన నేతలు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ దీనికి సైతం బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం లేదు.
* ప్రత్యర్ధులే ఎక్కువ..
అయితే బాలినేని మంత్రిగా ఉండే సమయంలో టిడిపి తో( Telugu Desam Party) పాటు జనసేన శ్రేణులు ఇబ్బంది పడ్డాయి. అందుకే బాలినేని రాకను వ్యతిరేకించాయి. అయితే రాష్ట్రస్థాయిలో అధినేత పవన్ నిర్ణయం తీసుకోవడంతో మెత్తబడ్డాయి. అయితే బాలినేని గతంల హవా చలాయిస్తానని అనుకుంటే మాత్రం కుదిరే పని మాత్రం కావడం లేదు. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు లభించే గౌరవం కూడా ఇప్పుడు బాలినేనికి లభించడం లేదు. మరోవైపు బాలినేని హైదరాబాద్కి ఎక్కువగా పరిమితం అవుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే ఒకవైపు, జనసేనలో ఆ ఇద్దరు నేతలు ఇంకో వైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్నట్టు బాలినేని పరిస్థితి ఉంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.
Also Read : ఆ మాజీ మంత్రి పండిస్తున్న మామిడి ధర కిలో అక్షరాల లక్ష!