Avanti Srinivas : మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు( Avanti Srinivas ) లైన్ క్లియర్ అయినట్టేనా? ఆయన టిడిపిలో చేరడం ఖాయమా? గ్రీన్ సిగ్నల్ లభించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. గత డిసెంబర్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విను వెంటనే ఆయన సైకిల్ ఎక్కుతారని ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభ్యంతరం తోనే ఆయన టిడిపిలో చేరిక ఆగిపోయింది ప్రచారం. అయితే జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో.. అవంతి శ్రీనివాసరావు టిడిపి హై కమాండ్ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ? ఫుల్ సైలెన్స్ కు కారణమేంటి?
* నెగ్గిన అవిశ్వాసం
మహా విశాఖ నగరపాలక సంస్థ( greater Visakha Municipal Corporation) మేయర్ పై కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం కూటమికి ఆశించిన స్థాయిలో బలం లేదు. కానీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల తరువాత చాలామంది కార్పొరేటర్లు టిడిపి తో పాటు జనసేనలో చేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు ఓటు ఉంది. కూటమికి ఏకపక్షంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సరే ఒకరిద్దరూ కార్పొరేటర్ల బలం చాలలేదు. ఈ తరుణంలోనే మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె, జీవీఎంసీ ఆరో వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం నుంచి కిందకు దిగింది. టిడిపికి చెందిన పీలా శ్రీనివాస్ మేయర్ గా ఎన్నిక కానున్నారు. అయితే చివరి నిమిషంలో అవంతి శ్రీనివాసరావు కుమార్తె కూటమికి అండగా నిలిచారు. అందుకే అవంతి శ్రీనివాసరావుకు టిడిపి అధిష్టానం డోర్లు తెరిచినట్లు తెలుస్తోంది.
* పిఆర్పి ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
ప్రజారాజ్యం( Praja Rajyam ) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. 2009లో తొలిసారిగా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. దీంతో ఆ పార్టీలో చేరారు. 2014 నాటికి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో అదే భీమిలి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరిపోయే అవంతి శ్రీనివాసరావు.. తొలిసారిగా ఓటమి చవిచూశారు.
* గంటా శ్రీనివాసరావు అభ్యంతరం..
అయితే ఇప్పుడు కూడా అధికార పార్టీని వెతుక్కుంటూ వెళ్లారు అవంతి శ్రీనివాసరావు. కానీ టిడిపిలో ఆయనకు చాన్స్ దక్కలేదు. దానికి కారణం గంటా శ్రీనివాసరావు. ఒకప్పుడు గంటా తో జత కట్టిన అవంతి శ్రీనివాసరావు.. ఆయనను విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే అవంతికి ఇబ్బందికరంగా మారింది. గతంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా అవంతి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే రాజకీయాల్లో ఇటువంటివి కామన్. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టిడిపి కైవసం చేసుకుంది. అవంతి శ్రీనివాస్ రావు కుమార్తె కార్పొరేటర్ రూపంలో కూటమికి సాయం చేశారు. ఇప్పుడు అదే అవంతికి ప్లస్ గా మారింది. టిడిపి హై కమాండ్ డోర్ తెరిచేలా చేసింది.