Assembly Speaker Ayyannapatrudu : ప్రస్తుతం శాసనసభ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కావడం లేదు. మండలికి మాత్రం హాజరై గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ తేల్చి చెబుతున్నారు. అయితే సభకు హాజరుకావాలని స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ కోరుతూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను సభకు హాజరవుతానంటూ ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ విషయంలో సంచలన ప్రకటన చేశారు.
Also Read : ఎమ్మెల్సీగా నాగబాబుకు నో ఛాన్స్.. చంద్రబాబుతో తేల్చి చెప్పిన పవన్!
* గత ఏడాది జూన్లో లేఖ
తనకు లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టారు అయ్యన్నపాత్రుడు( Ayyanna patrudu ) . 2024 జూన్ 24న జగన్మోహన్ రెడ్డి తనకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అందులో ఎటువంటి అభ్యర్థనలు లేవన్నారు. అభియోగాలతో పాటు బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. కొద్దిరోజుల తర్వాత హైకోర్టుకు కూడా వెళ్లారని చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తనకు సమన్లు జారీ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటిదేమీ జరగలేదని కూడా సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్పీకర్ ప్రకటన సంచలనంగా మారింది.
* ఆది నుంచి వివాదం
ఆది నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు విషయంలో జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) అనేక అభ్యంతరాలు ఉన్నాయి. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దూకుడుగా ఉండే నేత.. విపక్షాలపై విరుచుకుపడే నాయకుడిని ఎలా స్పీకర్ గా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ బాధ్యతలు తీసుకునే సమయంలో సైతం సభకు హాజరు కాలేదు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వక పోవడాన్ని కోర్టు తప్పుపడుతూ స్పీకర్ కు సమన్లు జారీ చేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండడం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి వచ్చింది. అందుకే ఆయన శాసనసభలో నేరుగా ప్రకటన చేయాల్సి వచ్చింది.
జగన్ రాసిన లేఖపై స్పీకర్ రియాక్షన్
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారు
హైకోర్టు స్పీకర్ కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగింది
అయితే.. జగన్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనేది హైకోర్టు నిర్థారణ చేయలేదు
– స్పీకర్ అయ్యన్నపాత్రుడు pic.twitter.com/wrXsVymtFA
— Swathi Reddy (@Swathireddytdp) March 5, 2025
Also Read : కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత.. లక్షల ఓట్ల మెజారిటీ ఎలా? వైసీపీలో అంతర్మధనం!