Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju : ఎక్కడైనా స్థానిక సంస్థల( local bodies) ప్రతినిధులు వస్తామంటే అధికార పార్టీ వారు తీసుకుంటారు. అవిశ్వాసం పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. వస్తాం అన్న వారిని పట్టించుకోవడం లేదు. తమకు ఆధిపత్యం అక్కరలేదని.. ఏడాది వరకు వెయిట్ చేసే ఓపిక తమకు ఉందని అధికార పక్షం తేల్చి చెబుతుండడం విశేషం. అటువంటి వింత పరిస్థితి ఎక్కడ ఉందో తెలుసా? విజయనగరం నగరపాలక సంస్థలో. టిడిపి గేట్లు తెలిస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు. కానీ టిడిపి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అసలు వారి ఆఫర్ ను పట్టించుకోవడం లేదు. అదే పొరుగున ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో అయితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎప్పుడు వస్తారా? ఎప్పుడు తీసుకుందామా? అని వేచి చూస్తున్నారు కూటమి నేతలు. విజయనగరంలో మాత్రం అందుకు విరుద్ధం.
Also Read : అమరావతిలో ఏడాదిలో చంద్రబాబు కొత్త ఇల్లు.. భూమి పూజ.. నిర్మాణ బాధ్యత ఆ సంస్థదే!
* వైసీపీకి ఏకపక్ష విజయం..
2001లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) విజయనగరం నగర పాలక సంస్థలో ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 50 డివిజన్లో ఉన్న కార్పొరేషన్ లో 49 డివిజన్లతో విజయకేతనం ఎగురవేసింది. తెలుగుదేశం పార్టీ ఒక డివిజన్ కు పరిమితం అయింది. అసలు విజయనగరంలో టిడిపికి స్థానం లేదన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ వ్యవహరించింది. గత ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ దారుణ పరిస్థితులను ఎదుర్కొంది. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. దాదాపు సీన్ రివర్స్ అయింది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గజపతి రాజ్ కుమార్తే ఆదితి గజపతిరాజు ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు కోలగట్ల సైతం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.
* ఒకే ఒక్క స్థానం ఉన్నా..
విజయనగరం నగరపాలక సంస్థలో( Vijayanagaram Municipal Corporation ) ఒకే ఒక్క తెలుగుదేశం కార్పోరేటర్ ఉన్నారు. కానీ అక్కడ టిడిపి నేత మేయర్ కావడం ఖాయం. అదెలా అంటే దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లంతా టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ విధేయుల ద్వారా అశోక్ బంగ్లాకు సమాచారం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా ఉన్న అశోక్ బంగ్లా నుంచి వారికి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. అయితే విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే అతిధి గజపతిరాజుకు కూడా ఉంది. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఒక ఏడాది వేచి చూద్దామని.. అంత దాకా చూస్తే తప్పేమీ లేదని కుమార్తెను వారిస్తున్నారు. అయితే పేరుకే అధికార పార్టీ కానీ కార్పొరేషన్లో చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నామన్న బాధ టిడిపి శ్రేణుల్లో ఉంది.
* అభ్యంతరానికి కారణాలు అవే..
అయితే అశోక్ గజపతిరాజు( Ashok gajpat Raj ) అభ్యంతరానికి కారణాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ కార్పోరేటర్లు కోలగట్ల అనుచరులే. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల తన అనుచరులకు కార్పొరేట్ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత కోలగట్ల సైలెంట్ అయ్యారు. కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే తన సీనియారిటీని, సిన్సియారిటీని తెరపైకి తెచ్చారు అశోక్ గజపతిరాజు. వారిపై అవినీతి ఆరోపణలు ఉండడం, ఆపై కోలగట్ల అనుచరులు కావడంతో.. అశోక్ గజపతిరాజు వారికి చెక్ చెప్పినట్లు తెలుస్తోంది. వారి ద్వారా కోలగట్ల రాజకీయం చేస్తున్నారని గ్రహించినట్లు సమాచారం. అయితే ఏడాది పీఠం గురించి చూసుకుంటే.. విజయనగరంలో లేనిపోని ఇబ్బందులు వస్తాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారట. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లకు నో సిగ్నల్ అని బోర్డు పెట్టారట.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ashok gajapathi raju ashok gajapathi raju gives no signal to ysr congress corporators to join tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com