Asaduddin Owaisi sensational Comments on Nara Lokesh: ఏపీ సీఎం చంద్రబాబు కు కీలక సూచన చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ( Asaduddin Owaisi ). ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. సుదీర్ఘంగా పదవులు అనుభవించారు. ఇక తప్పుకోండి అన్నట్టు చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు చేజేతులా లోకేష్ భవిష్యత్తును పాడు చేస్తున్నారని కూడా అన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు అన్నది తెలియడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరిస్తామని చంద్రబాబు ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ..
2024 ఎన్నికల్లో ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఎంఐఎం( MIM) పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు అలా చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా తెలుగుదేశం ప్రస్తావన తీసుకొచ్చారు ఓవైసీ. ఎంఐఎం పార్టీ సమావేశంలో లోకేష్ కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన పాపులారిటీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది. అసలు ఓవైసీ ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నేత లోకేష్. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పదవులు అనుభవించింది చాలు. ఇక తప్పుకొని లోకేష్ కు అవకాశం ఇవ్వాలని సూచించారు. లేకుంటే మాత్రం లోకేష్ భవిష్యత్తును పాడు చేసిన వారవుతారు అంటూ కామెంట్స్ చేశారు.
లోకేష్ కు అప్పగించవచ్చు కదా..
ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు( CM Chandrababu) 9 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. మరో 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా.. రెండోసారి సీఎం గా.. ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కూడా పదవి చేపట్టారు. ఈ రాజకీయ జీవితం చాలదా? లోకేష్ కు బాధ్యతలు అప్పగించవచ్చు కదా? అని సూచించారు ఓవైసీ. అంతటితో ఆగని ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పోటీగా లేరు కదా? అనేసరికి ఎంఐఎం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగించాయి. అయితే ఆయనకు అంత పాపులారిటీ ఉందా అని కూడా ఓవైసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఓవైసీ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో.. అసలు ఏం జరిగిందో.. ఎందుకు ప్రస్తావన వచ్చిందో మాత్రం తెలియడం లేదు.