Chandrababu: ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరోజు ఉదయం 11:53 నిమిషాలకు జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని టిడిపి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పండితులు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈనెల 12న ప్రమాణస్వీకారం పండితులు ముహూర్తం చూశారు. కానీ ఆలస్యం అవుతుందని భావించి టిడిపి ముఖ్య నాయకులు వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లలో నారా లోకేష్ నిమగ్నమయ్యారు. మంగళగిరి కి తూర్పు దశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టిడిపి నేతలు అన్వేషిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ చెందిన ఆర్కే ఈవెంట్ ప్రతినిధులు అమరావతికి చేరుకున్నారు. వారితో పాటు 20 లారీల్లో పరికరాలు అమరావతికి చేరుకున్నాయి. వీలైనంత త్వరగా మైదానాన్ని ఎంపిక చేసుకొని పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కూటమి నేతల సమావేశానికి చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్ళనున్నారు. అంతకంటే ముందే సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత మంగళవారం రాత్రి పవన్ఇంటికి చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ కూర్పు పై ఇద్దరు నేతలు చర్చించారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలతో సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడో తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడే లాంఛనంగా కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ అందిస్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎం గా మొదటిసారి, 1999లో రెండోసారి, రాష్ట్ర విభజన అనంతరం 2014లో మూడోసారి, ఈసారి నాలుగో సారి టిడిపి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సరికొత్త రికార్డును లిఖించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు సీఎంగా కొనసాగారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి సీఎం అయ్యారు.