https://oktelugu.com/

Aam Aadmi Party: ఆప్‌ తిరోగమనం.. లోక్‌సభ ఎన్నికల్లో విలాపం!

జాతీయ పార్టీగా ఇటీవలే గుర్తింపు పొందిన ఆప్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో 22 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం పంజాబ్‌లో మాత్రమే 3 సీట్లు గెలిచింది.

Written By: Raj Shekar, Updated On : June 5, 2024 11:12 am
Aam Aadmi Party

Aam Aadmi Party

Follow us on

Aam Aadmi Party: లోక్‌సభ ఎన్నికలు కొన్ని పార్టీలకు బూస్ట్‌ ఇవ్వగా కొన్ని పార్టీలను తీవ్ర నిరాశపరిచాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకుంది. అయితే అదే కూటమిలో ఉన్న ఆప్‌కు ఈ ఫలితాలు నిరాశపర్చాయి. పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక పంజాబ్‌లో కేవలం 3 స్థానాలకు పరిమితమైంది.

ఐదు రాష్ట్రాల్లో పోటీ…
జాతీయ పార్టీగా ఇటీవలే గుర్తింపు పొందిన ఆప్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో 22 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం పంజాబ్‌లో మాత్రమే 3 సీట్లు గెలిచింది.

లిక్కర్‌ స్కాం ప్రభావం..
2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలో మెజారిటీ స్థానాలు గెలిచిన ఆప్‌.. ఈసారి మాత్రం ఒక్క సీటు గెలవలేదు. లిక్కర్‌ స్కాం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్‌కు వ్యతిరేక పవనాలే వీచాయి. అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలతోపాటు మరో మూడు రాష్ట్రాల్లోనూ ఫలితాలు ఆ పార్టీని నిరాశపరిచాయి. నిజాయతీకి మారుపేరుగా ఉన్న పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. సానుభూతి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ పార్టీకి తిరోగమనం మొదలైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.