Araku Coffee Exports: అరకు కాఫీకి( Araku coffee) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే కాకుండా.. మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా గిరిజనుల జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల అమ్మకం, పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వంటి 21 అంశాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా అరకు కాఫీ బ్రాండ్ అంతర్జాతీయంగా విస్తరించేందుకు, మార్కెటింగ్ కోసం దిగ్గజ సంస్థ టాటా కంపెనీ జిసిసి తో ఒప్పందం చేసుకుంది.
Also Read: మీ వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తోందా..? అయితే ఇలా చేయండి..
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..
అరకు కాఫీ ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ఐక్యరాజ్యసమితి( United Nations Organisation) నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. చింతపల్లి ప్రాంతంలో రెడ్ చెర్రీ రిఫైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి సబ్ కో సంస్థ ముందుకొచ్చింది. విశాఖ మన్యంలో కాఫీ తోటల విస్తరణకు సంబంధించి ఐటీసీ పాడేరు ఐటీడీఏతో ఒప్పందం చేసుకుంది. గిరిజన మహిళల ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయం కోసం ఫ్రాంటీయర్ మార్కెటింగ్ , ఈజీ మార్ట్ లు ప్రభుత్వంతో ఒప్పందాన్ని చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందాలన్నీ అరకు కాపీ చుట్టూ జరగడం విశేషం. ఇప్పటికే జాతీయ స్థాయిలో సైతం అరకు కాఫీకి గుర్తింపు లభించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా కాఫీ చర్చనీయాంశం అయింది.
Also Read: మల్లారెడ్డి సార్ లెక్కనే పాలమ్ముతోంది.. పాతికేళ్ల ఈ అమ్మాయి ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలుసా.
విస్తారంగా సాగు..
అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raj ) జిల్లాలో కాఫీ సాగు విస్తారంగా సాగుతోంది. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లోని 2.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఏకంగా పార్లమెంటులోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీ దూసుకెళ్లేలా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు జరగడం విశేషం. సదరు సంస్థలు అనుకున్న స్థాయిలో అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగితే.. అరకు కాఫీ అంతర్జాతీయంగా దూసుకెళ్లడం ఖాయం.