Rakhi Festival Politics: సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో మద్యం కుంభకోణంలో అరెస్టయి కల్వకుంట్ల కవిత జైలులో ఉన్నారు. అప్పుడు రాఖీ పండుగ వచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు.. ఆ పార్టీ మహిళా నేతలు రాఖీ కట్టారు. కవితలేని లోటును తీర్చారు. జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత కవిత తన సోదరుడికి రాఖీ కట్టారు. అప్పట్లో కల్వకుంట్ల తారక రామారావుకు కవిత రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
Also Read: కేటీఆర్‌ను వదలని ‘గువ్వల’.. బీఆర్ఎస్‌లో మరో కలకలం
కవితను బెయిల్ మీద విడుదల చేయించడానికి కల్వకుంట్ల తారక రామారావు ఎన్నో ప్రయత్నాలు చేశారు. రోజుల తరబడి ఢిల్లీలోనే మకాం వేశారు. అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత ఆమెను బెయిల్ మీద బయటకు తీసుకురావడంలో విజయవంతమయ్యారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. అది కాస్త పొలిటికల్ వైరానికి దారితీసింది. మధ్యలో కవిత రాసిన లేఖలు విడుదల కావడం.. ఆమె దయ్యాలు, గ్రీకువీరులు కోవర్టులు అంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించాయి. ఇదే క్రమంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు కవితకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఒక రకమైన చర్చకు దారితీసింది.
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
ఇలా గులాబీ దళపతి కుటుంబంలో విభేదాలు జరుగుతున్న క్రమంలోనే.. వెలుగులోకి అనేక సంచలన విషయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు సరిగ్గా రాఖీ పండుగ ముందు కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే విషయాల మీద క్లారిటీ లేదు. మరోవైపు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి రాఖీ కట్టడానికి జాగృతి అధినేత్రి ప్రయత్నించారని.. రాఖీ కట్టడానికి ఇంటికి రానా అని మెసేజ్ కూడా పెట్టారని.. దానికి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ గులాబీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రిప్లై ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని సమాచారం.. ఇటీవల కాలంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జాగృతి అధినేత్రి మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి రాఖీ పండుగ బలం చేకూర్చింది. కవిత వస్తానని చెప్పినప్పటికీ కేటీఆర్ ఔట్ ఆఫ్ స్టేషన్ అని రిప్లై ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. మొత్తంగా చూస్తే ఇద్దరి మధ్య విభేదాలు పూడ్చలేని స్థాయికి పెరిగిపోయాయని.. ఇది అంతిమంగా పార్టీలో ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిని గులాబీ దళపతి ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.