Aqua Industry: ఆక్వా( Aqua) రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. లక్షలాదిమంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలను విధిస్తున్న తరుణంలో.. ఏపీలో ఆక్వా రంగం ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడింది. ఈ తరుణంలో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వారి నుంచి వచ్చిన ఓ విన్నపాన్ని అంగీకరించింది ఏపీ ప్రభుత్వం. ఇది ఆక్వా రైతులకు ఊరట కలిగించే విషయమే. ఈ మేరకు రొయ్యల మేత తయారీదారుల నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. అమెరికాకు పెద్ద ఎత్తున ఏపీ నుంచి రొయ్య ఎగుమతి అయ్యేది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఈ రొయ్యపై ఎగుమతి పన్ను పెరిగింది. దాని ప్రభావం ధరపై పడింది. ధర గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ధర తగ్గించుకోవాల్సి వస్తోంది. అదే జరిగితే ఆక్వా రైతులు సాగు నుంచి వెనక్కి తగ్గాల్సి ఉంటుంది.
Also Read: కేసీఆర్ రాజకీయ గేమ్‌ప్లాన్.. అదను కోసం గులాబీ బాస్ ఎదురు చూపు!
* రొయ్యల మేత ధర తగ్గింపు..
సాధారణంగా ప్రభుత్వం రెయ్యిల మేతకు సంబంధించి పన్నులు వసూలు చేసేది. దీంతో రొయ్యల రైతులు మేత ధర తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రొయ్యల తయారీదారులతో సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. వారిని ధర తగ్గించేందుకు ఒప్పించింది. మరోవైపు రొయ్యల మేత ధర కూడా తగ్గించేందుకు సంబంధిత సంఘం ప్రతినిధులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రొయ్యల మేత తయారీదారుల సంఘం అధ్యక్షుడు బీద మస్తాన్ రావు ( Mastan Rao )ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రొయ్యల మేత ధరలను కిలో నాలుగు రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రొయ్యల రైతులు ఇకపై కొనుగోలు చేసే మేతపై ఈ మేరకు ధర తగ్గబోతోంది. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో రొయ్యల మేత ధర తగ్గడం నిజంగా ఉపశమనం కలిగించే విషయం.
* ఇప్పట్లో నో ఛాన్స్..
అగ్ర దేశం అమెరికాకు( America) ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంతలో దేశీయంగా ఇతర రాష్ట్రాలకు రొయ్యల ఎగుమతులు చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రొయ్యల ఎగుమతి దారులు రైతులకు తక్కువ ధరకు అడుగుతున్నారు. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తగినంత ప్రోత్సాహం లేకుండా పోయింది. వారికి ప్రత్యేక కేటాయింపులు లేవు. రాయితీలు అంతకంటే లేవు. విద్యుత్ పరంగా కూడా రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో చాలామంది రైతులు ఆక్వారంగానికి దూరమయ్యారు.తీర ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆక్వా సాగు కొనసాగింది.
* ఆక్వా రంగంపై ఫోకస్..
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చింది. ఆక్వా రంగం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇటీవల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఆక్వా రంగానికి రాయితీతో కూడిన విద్యుత్ అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనిట్ విద్యుత్తును రూ.1.50 లకు అందించేందుకు ఎటువంటి షరతులు పెట్టొద్దని.. ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపచేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇంతలోనే ట్రంప్ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్ ను ప్రోత్సహిస్తూనే మేత ధరలు తగ్గించాలని నిర్ణయించడం ఉపశమనం కలిగించే విషయం.