Jagan Free Publicity: దేశంలో ఎంతోమంది సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. రాజకీయంగా తలపండిన వారు కూడా ఒక్కోసారి చతికిల పడుతుంటారు. వారి అంచనాలు సైతం తప్పుతుంటాయి. అయితే ఇది సర్వసాధారణ విషయం. ఒక్కోసారి ప్రత్యర్థులను పదేపదే తలచి వారికి ఉచిత ప్రచారం కల్పిస్తుంటారు నేతలు. ఏపీలో కూడా అటువంటిదే జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య పాలించిన చంద్రబాబు( CM Chandrababu).. పదేపదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి హైలెట్ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు కారణం అయ్యారు. పోనీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సైతం అదే తప్పిదానికి పాల్పడ్డారు. మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే పని చేస్తున్నారు.
Also Read: ఏపీ బీజేపీ చీఫ్ నియామకం వెనుక పవన్? కొత్త సమీకరణాలు
రాజకీయ చతురత ఏది?
వాస్తవానికి చంద్రబాబు రాజకీయ చతురత ఇంకోలా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. అపజయం ఎదురైన ప్రతిసారి ఆయన రెట్టింపు ఉత్సాహంతో పని చేసే గుణం అలవర్చుకున్నారు. 2009లో అధికార కాంగ్రెస్ పార్టీని( Congress Party) ఢీకొట్టే క్రమంలో రాజకీయంగా విభేదించే అన్ని పార్టీలను కూటమి వైపు తేగలిగారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది సీనియర్లు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దారుణ ఫలితాలు వచ్చాయి. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ 2014లో మరోసారి విజయాన్ని దక్కించుకొని తన సమర్థతను చాటుకున్నారు చంద్రబాబు. 2019లో అధికారాన్ని పోగొట్టుకొని దారుణ రాజకీయ అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా సరే అంతటి వయసులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అధికారంలోకి రాగలిగారు
ఇప్పటికీ గత తప్పిదాలే..
అయితే ఇప్పుడు చంద్రబాబు గత తప్పిదాలనే పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) అవకాశం ఇస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వేదిక ఏదైనా.. ఎలాంటి కార్యక్రమం జరిగినా.. నిండు అసెంబ్లీ అయినా.. మీడియాతో మీట్ అయినా.. పారిశ్రామికవేత్తలతో సమావేశం అయినా.. ఇలా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఖజానాను కాళీ చేశారని చెప్పుకున్నారు. అటు తరువాత విధ్వంసకారుడిగా చిత్రీకరించి.. తనతో పాటు నేతలంతా దానిని హైలెట్ చేసేలా చూశారు. అయితే ప్రారంభంలో ఈ విమర్శలు సరిపోతాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇప్పుడు అదే మాటలు చెప్పడం ద్వారా జగన్ కు ఉచిత ప్రచారం కల్పించినట్టు అవుతుంది. మరోవైపు జగన్ అంటే చంద్రబాబు భయపడుతున్నారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ.. ఆయన చేస్తున్న ఆలోచన మాత్రం సరిగా లేదన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: వల్లభనేని వంశీ మోహన్ సంచలన నిర్ణయం!?
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు..
ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. 2019లో వన్ చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలను( welfare schemes) పెద్ద ఎత్తున అమలు చేశారు. కానీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. అయితే నేడు సోషల్ మీడియా రాజ్యమేలుతున్న సమయం. అందుకే తాము ఎక్కడ వెనుకబడి పోతామన్న భయంతో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ గురించి తరచూ మాట్లాడి ఉండవచ్చు. కానీ ఈ విషయంలో చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటేనే మంచిది. లేకుంటే ఏదో ప్రయత్నం గా మారే అవకాశం ఉంది.