Game Changer : గేమ్ ఛేంజర్ నిర్మాత శిరీష్(PRODUCER SIRISH)ఆ చిత్ర దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. శిరీష్ కామెంట్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా Ram charan : వేదికగా తమ అసహనం వ్యక్తం చేశారు. రామ్ చరణ్(RAM CHARAN) ఫ్యాన్స్ సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో నిర్మాత శిరీష్ లేఖ విడుదల చేశాడు. రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కి ఆయన క్షమాపణలు చెప్పారు. రామ్ చరణ్ ని కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు(DIL RAJU), శిరీష్ లను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆగలేదు. దాంతో శిరీష్ ఓ వీడియో బైట్ విడుదల చేశాడు.
చిరంజీవి(CHIRANJEEVI) గారితో, రామ్ చరణ్ గారితో తమకు ప్రత్యేక అనుబంధం ఉందన్న శిరీష్, ఆ చనువుతోనే మాట జారింది అన్నారు. అయితే రామ్ చరణ్ గారిని కించపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదంటూ… మరోసారి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదానికి అసలు కారణం దర్శకుడు శంకర్ అనేది వాస్తవం. గేమ్ ఛేంజర్(GAME CHANGER) మూవీ భారీగా నష్టాలు మిగల్చడానికి ఆయన తీరు. గొప్ప దర్శకుడైనప్పటికీ శంకర్ ని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. గేమ్ ఛేంజర్ ని ఎస్వీసీ బ్యానర్ లో 50వ చిత్రంగా దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఈ చిత్ర విజయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అనుకున్నారు.
Also Read: హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ లో క్రిష్ లేని లోటు తెలిసిపోతుందా..? ఆయన ఉంటే ఆ తప్పు జరిగేది కాదా..?
గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలుపెట్టిన శంకర్, వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాడు. గేమ్ ఛేంజర్ పై శంకర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు అనేది నిజం. ఏక కాలంలో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాలను షూట్ చేశారు. ఈ క్రమంలో అనుకున్న సమయం కంటే గేమ్ ఛేంజర్ ఆలస్యం అయ్యింది. బడ్జెట్ పరిమితులు దాటేసింది. ఇదే విషయాన్ని దిల్ రాజు ఇటీవల ప్రస్తావించాడు. గేమ్ ఛేంజర్ విషయంలో నేను సరిగా అగ్రిమెంట్ లో అంశాలు పొందుపరచలేదు. అది తాను చేసిన పొరపాటు అన్నారు.
గేమ్ ఛేంజర్ పూర్తి అయ్యే వరకు మరో చిత్రాన్ని చేయడానికి వీల్లేదు అని శంకర్ కి దిల్ రాజు కండీషన్ పెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. శంకర్ చేసిన తప్పు వలన దిల్ రాజు తో పాటు రామ్ చరణ్ కూడా నష్టపోయాడు. దాదాపు మూడు ఏళ్ళు మరో సినిమా చేయకుండా తన సమయాన్ని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కేటాయించారు. వందల కోట్లలో నష్టాలు రావడంతో దిల్ రాజు, శిరీష్ అసహనం బయటపెట్టారు. నిజానికి వారు నిందించాల్సింది దర్శకుడు శంకర్ ని. గేమ్ ఛేంజర్ ఫలితానికి సోలోగా శంకరే కారణం. అలా రామ్ చరణ్-దిల్ రాజు ప్రస్తుత వివాదానికి శంకర్ కారణం అయ్యాడు.