Chandrababu BJP Influence: బిజెపి( Bhartiya Janata Party) ఇంకా గుణపాఠాలు నేర్వలేదా? గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడం లేదా? తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతంపై చేస్తున్న ఆలోచన ఏంటి? ఇతర పార్టీల ప్రభావానికి హై కమాండ్ లోనవుతోందా? వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల కు అధ్యక్షులను నియమించింది భారతీయ జనతా పార్టీ. అయితే ఈ నియామకాల వెనుక ఇతర పార్టీల ప్రభావం ఉందన్న టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీల నుంచి ఈ తరహా వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అయితే ఏపీ కంటే తెలంగాణలో నియామకం ఆశ్చర్యం వేస్తోంది.
మాధవ్ నియామకం వెనుక..
బిజెపి భావజాలం ప్రత్యేకం. అక్కడ ఆర్ఎస్ఎస్ తో( RSS) పాటు బిజెపి సిద్ధాంతాలకు లోబడి పని చేసిన నేతలకు పార్టీ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘకాలం బిజెపిలో పని చేశారు. ఆయన తండ్రి సైతం ఉమ్మడి ఏపీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా సేవలందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ కూడా పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే బిజెపి అధ్యక్ష పదవి కోసం పెద్దపెద్ద నేతలు ప్రయత్నించారు. కానీ చివరకు మాధవ్ కు వరించింది పదవి. దీని వెనుక కూటమి పెద్దల హస్తం ఉందన్నది ఒక ప్రచారం. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆమోదం ముద్ర వేయడం వల్లే మాధవ్ నియామకం జరిగిందన్నది బిజెపిలో జరుగుతున్న ప్రచారం.
Also Read: మణిపూర్ సమస్యకు పరిష్కారం మోదీ చేతులో లేదా..?
తెలంగాణలో సైతం
తెలంగాణలో సైతం కొత్త నేతను ఎన్నుకున్నారు. రామచంద్ర రావు( Ramachandra Rao ) అనే నేతకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు పార్టీకి ఒక ఊపు వచ్చింది. తెలంగాణలో అప్పటి అధికార పార్టీకి ధీటుగా పార్టీని నడిపించారు సంజయ్. అయితే అప్పట్లో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది బిజెపి హై కమాండ్. అయితే ఇప్పుడు కూడా రామచందర్రావును నియమించి అదే తప్పు చేసిందన్న టాక్ వినిపిస్తోంది తెలంగాణ సమాజంలో. ఆది నుంచి రామచంద్రరావు బిజెపిలో బలంగా పనిచేశారు. అయితే అది కాదనలేం కానీ. తాజాగా ఆయన నియామకం వెనుక ఏపీ పెద్దల హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఇతర పార్టీలు సైతం మేనేజ్ చేస్తాయి అన్న టాక్ బలంగా వస్తుంది. అన్నింటికీ మించి రామచందర్రావు ఏపీ సీఎం చంద్రబాబు మనిషి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Also Read:
సుదీర్ఘకాలం స్నేహితుడిగానే..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఆవిర్భావం నుంచి బిజెపి ఆ పార్టీతో జతకడుతూ వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో తప్పించి బిజెపితో టిడిపి జతకట్టిన ప్రతిసారి అధికారంలోకి రాగలిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి బిజెపి లాభం చేకూర్చిందే తప్ప.. టిడిపి నుంచి బిజెపికి పెద్దగా రాజకీయ లబ్ధి చేకూరలేదన్నది ఒక కామెంట్. ప్రధానంగా బిజెపి నియామకాల వెనుక చంద్రబాబు ఉంటారన్నది ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం. తాజాగా తెలుగు రాష్ట్రాల అధ్యక్ష పదవి నియామకంలో కూడా చంద్రబాబు యాక్టివ్ రోల్ ప్లే చేశారన్నది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. మొత్తంగా బిజెపిని తన కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. విశ్లేషణలు కూడా అలానే వస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.