ఆంధ్రప్రదేశ్‌AP SSC Results 2025: ఒకేసారి తండ్రీకూతురు పదో తరగతి ఉత్తీర్ణత.. కవలలకు సమాన మార్కులు!

AP SSC Results 2025: ఒకేసారి తండ్రీకూతురు పదో తరగతి ఉత్తీర్ణత.. కవలలకు సమాన మార్కులు!

AP SSC Results 2025: ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కాకినాడకు చెందిన నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన పావని చంద్రిక ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో అయితే తండ్రీ కూతురు ఒకేసారి పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలో కవలలకు సమానంగా 582 మార్కులు రావడం మరో విశేషం. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం కూడా ఈసారి ప్రత్యేకత. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే పదో తరగతి ఫలితాల్లో ప్రగతి కనిపిస్తోంది. ఉత్తీర్ణత శాతం పెరిగింది.

Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!

* సరికొత్త రికార్డు
సాధారణంగా 600కు 600 మార్కులు రావడం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. కాకినాడకు( Kakinada) చెందిన నేహాంజని( Neha Anjani) ఈ ఘనత సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధము రాలిగా నిలిచింది. మరో ఆరుగురు విద్యార్థులకు 599, మరో 14 మందికి 598 మార్కులు రావడం విశేషం. పల్నాడు జిల్లా జప్పిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పావనిచంద్రికకు 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిగా చంద్రిక నిలిచింది. అయితే ఈసారి విద్యార్థులు ఎక్కువగా ఫస్ట్ డివిజన్లోనే ఉత్తీర్ణత సాధించారు. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే.. వారిలో 4,01,597 మంది ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం విశేషం.

* కూతురుతో పాటే ఉత్తీర్ణత
చిత్తూరు( Chittoor) జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. తండ్రీ కూతురు ఒకేసారి పదో తరగతి ఉత్తీర్ణత సాధించడం విశేషం. రొంపిచర్ల పాలెం వీధికి చెందిన బాకా ఇస్మాయిల్ ఆర్టీసీ కండక్టర్. ఆయన కుమారుడు షబ్బీర్ 1995-96లో పదో తరగతి ఫెయిల్ అయ్యారు. అయితే ఆయన తండ్రి ఇస్మాయిల్ కండక్టర్గా పని చేస్తూ చనిపోయారు. ఇంతలో షబ్బీర్ కూడా ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారారు. అయితే తన తండ్రి ఉద్యోగం తనకు దక్కుతుందని భావించి ఈ ఏడాది.. దూరవిద్యలో పదో తరగతి పరీక్ష రాశాడు. ఆయన కుమార్తె సమీనా సైతం పదో తరగతి పరీక్షలు ఇదే ఏడాది రాసింది. అయితే ఫలితాల్లో షబ్బీర్ కు 319 మార్కులు వచ్చాయి. సమీనా 39 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

* కవలలకు సమానంగా మార్కులు..
పార్వతీపురం మన్యం జిల్లాలో( parvatipuram manyam district ) సైతం విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బలిజిపేట మండలం వంతరం కు చెందిన బెవర శరణ్ కార్తికేయ, బెవర సింధు శరణ్య కవలలు. అయితే పదో తరగతి ఫలితాల్లో ఇద్దరికీ సమానంగానే మార్కులు వచ్చాయి. అన్నా చెల్లెలు 582 మార్కులు చొప్పున సాధించారు. వారి తండ్రి రాము న్యాయవాది కాగా.. తల్లి కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగిని. ఇలా పదో తరగతి ఫలితాల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

 

Also Read: వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Nara Lokesh: కాళీ మాత దీవించింది.. నారా లోకేష్ కాదు.. డోలో 650 లోకేష్.. కోల్ కతా లో ఇంత జరిగింది మరి

Nara Lokesh: కోల్ కతా కు నారా లోకేష్.. ఎందుకు వెళ్లారు.. దేనికోసం వెళ్లారు.. మొన్ననే కదా ఆయన రష్యా వెళ్ళింది.. అక్కడ అనేక సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది.. పెట్టుబడులు పెట్టడానికి వారికి...

Chittoor: మీరు మనుషులేనా.. వినాయక చవితి వేడుకల్లో ఇంత అశ్లీలమా..

Chittoor: దేశ స్వాతంత్ర ఉద్యమం లో ప్రజలందరినీ ఏకతాటి పైన నిలపడానికి బాలగంగాధర తిలక్ గణపతి చవితి వేడుకలను తెరపైకి తీసుకొచ్చారు. పేరుకు ఆధ్యాత్మికం లాగా కనిపించినప్పటికీ.. దేశ ప్రజలందరినీ ఏకతాటి మీద...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version