Road Accident: కర్ణాటకలోని హౌస్కోటే వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు మరణించారు. ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేస్తూ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కేశవరెడ్డి, తులసి, ప్రణతి, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.